Wednesday, 4 November 2026

ఆంటోని అధ్యక్షతన తెలంగాణపై మంత్రుల బృందం


న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8, (జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసిం ది. తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటుపై ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకు ముందు తెలంగాణపై కేంద్రం ఏర్పాలు చేసిన మంత్రుల బృందాన్ని కుదించారు. గతంలో పది మంది మంత్రులను ఈ బృందంలో నియమించగా ఇప్పుడు ఏడుగురితో మాత్రమే ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు.  ఈ కొత్త బృందానికి కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంటోని చైర్మన్‌గా ఖరారు చేశారు. ఆర్థిక మంత్రి చిదంబరం, హోంమంత్రి సుశీల్‌ కుమార్‌  షిండే, ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్‌, చమురు శాఖ మంత్రి వీరప్పమొయిలీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్‌,ఈ బృందంలోని ఇతర సభ్యులుగా ఉంటారు. మంత్రుల బృందంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా  ప్రధాని కార్యాలయ శాఖ సహాయ మంత్రి నారాయణ స్వామికి చోటు కల్పించారు. ఆంధ్రధ్రప్రదేశ్‌ విభజన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాలను ఈ బృందం పరిశీలించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *