Tuesday, 3 November 2026

తెలంగాణ ప్రక్రియ అధికారికంగా ఆరంభం


సీమాంధ్రలో సమస్యలను మంత్రుల బృందం పరిష్కరిస్తుంది
కొత్త రాజధానికి భారీ ప్యాకేజీ : దిగ్విజయ్‌సింగ్‌
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 13 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అధికా రికంగా ప్రారంభమైనట్లు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్య వహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపా రు. ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియా ప్రతిని ధులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించాకే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై తుది నిర్ణయం తీసుకుందని దిగ్విజయ్‌సింగ్‌ ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల అభ్యంతరాలను కేంద్ర మంత్రివర్గ బృందం చర్చించి పరిష్కారం చూపుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గ బృందంలోని ఏడుగురు మంత్రులకు కేటాయించిన శాఖల వారీగా పరిష్కరిస్తారని తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే కొత్త రాజధానికి భారీ ప్యాకేజీ ఇస్తామని దిగ్విజయ్‌ పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని అన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె విరమించిన ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. విభజన నేపథ్యంలో ఎవరికీ అన్యాయం జరుగబోదని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *