Tuesday, 3 November 2026

సొంతగడ్డపైనే సచిన్‌ చివరి ఆట


ముంబయి, అక్టోబర్‌ 15 (జనంసాక్షి) :
మాస్టర్‌ బ్లాస్టర్‌.. క్రికెట్‌ యోధుడు సచిన్‌ రమేశ్‌ టెండుల్కర్‌ చివరి టె స్టు మ్యాచ్‌కు ఆయనకు అత్యంత ఇష్టమైన వాంఖడే స్టేడియం వేదిక గా మారింది. సచిన్‌ 200వ టెస్టు మ్యాచ్‌ తిలకించేందుకు అభిమాను లు సైతం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. నవంబరు 14 నుంచి నవంబరు 18వరకు మ్యాచ్‌ కొనసాగనుంది. ఈ మ్యాచ్‌ ద్వారా సచిన్‌ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో జమ చేసుకోనున్నాడు. ఈ మ్యాచ్‌తో క్రికెట్‌ రంగంలో ప్రపంచంలోనే 200 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా సచిన్‌ తన పేరిట రికార్డును నమోదు చేసుకోనున్నారు. క్రికెట్‌ రంగంలో సచిన్‌ ఎవరెస్టు స్థాయికి చేరుకున్నట్టే. ఇదిలా ఉండగా సచిన్‌ ఇప్పటివరకు 198 టెస్టు మ్యాచ్‌లు ఆడిన విషయం తెలిసిందే.  నవంబరు 6న 199వ టెస్టుమ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌లో సచిన్‌ ఆడనున్నారు. 200వ మ్యాచ్‌ను తన సొంతగడ్డ అయిన ముంబయిలో ఆడనున్నారు. రాజ్యసభలో ఎంపీగా సచిన్‌ నామినేట్‌ అయిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *