Tuesday, 3 November 2026

బిర్లాకు బొగ్గుమసి


హైదరాబాద్‌, ముంబైలో సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ/ముంబయి, అక్టోబర్‌ 15 (జనంసాక్షి) :
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గుకుంభకోణం బిర్ల గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లానూ అంటుకుంది. దీనిపై విచారణ జరుపుతున్న సీబీఐ మంగ ళవారం 15వ చార్జిషీట్‌ దాఖలు చేసింది. హైద రాబాద్‌, కోల్‌కతా, ఢిల్లీ, ముంబయి లలో అధికారులు తీవ్రస్థాయిలో తనిఖీలు కొనసాగి స్తున్నారు. తాజా చార్జిషీట్‌లో కుమార మంగళం బిర్లాతో పాటు బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌ పేరును కూడా చేర్చారు. యూపీఏ -1 హయాంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్వయంగా బొగ్గు మంత్రిత్వ శాఖను పర్యవేక్షించిన కాలంలో చోటు చేసుకున్న భారీ బొగ్గు కేటాయింపుల కుంబ óకోణం వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వెల్లడించిన సంగతి తెలిసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిం చిన కాగ్‌ నివేదిక ఆధారంగా ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. 2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపుల్లోనూ  1.70 లక్షల కోట్ల కుంభకోణం జరిగినట్టు కాగ్‌ తేల్చిన తర్వాతనే ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ రెండు వ్యవహారాల్లో దేశవ్యాప్తంగా పలువురు వీ వీఐపీ కటకటాల పాలు కాగా మరికొందరు విచారణ ఎదుర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *