
న్యూఢిల్లీ, అక్టోబర్ 18 (జనంసాక్షి) :
సీమాంధ్ర ఎంపీల రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించినట్టు ఆమె కార్యాలయం శుక్రవారం సాయంత్రం తెలియ జేసింది. రాష్ట్రానికి చెందిన 13 మంది పార్లమెంటు సభ్యుల రాజీనామాలు తిరస్క రించినట్టు వారికి ఫోన్‌లో సమాచారం పంపి నట్టు తెలిసింది. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని సీమాంధ్ర ప్రాంతా నికి చెందిన 13 మంది ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. అందులో ఏడుగురు ఎంపీలు వ్యక్తిగతంగా కలుసుకుని తమ రాజీనా మాలను ఆమోదించాలని కోరిన విషయం విదితమే. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణకుమార్, అనంత వెంకట్రాం రెడ్డి, మాగుంట శ్రీనివాసు లురెడ్డి, ఎ.సాయిప్రతాప్, రాయపాటి సాంబశివరావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, సబ్బంహరి, కను మూరి బాపిరాజు, జివి హర్షకుమార్, ఎస్‌పివై రెడ్డి, ఎం.రాజమోహన్‌రెడ్డి, కొనకళ్ల నారాయ ణ రాజీనామా సమర్పించిన వారిలో ఉన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వారంతా రెండు నెలల క్రితం రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే. రాజీనామాలు సమర్పించిన వారిలో 10 మంది కాంగ్రెస్ ఎంపీలు.. ఇద్దరు వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు కాగా.. మరొకరు టీడీపీకి చెందినవారు. వివరణ అనంతరం రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించారు. తమ రాజీనామాలు ఆమోదించాలని పలుమార్లు ఎంపీలు స్పీకర్‌ను కలిసి కోరిన విషయం తెలిసిందే.
స్పీకర్ ఫార్మాట్‌లోనే.. : హర్షకుమార్
స్పీకర్ ఫార్మాట్‌లోనే తమ రాజీనామాలను సమర్పించామని ఎంపి హర్షకుమార్ తెలిపారు. ఎందుకు తిరస్కరించారో అర్ధం కావడం లేదని శుక్రవారం సాయంత్రం మీడియాకు చెప్పారు.




