Tuesday, 3 November 2026

తెలంగాణ ఏర్పడి తీరుతుంది ఎవరడ్డుకున్నా ఆగదు


వెయ్యేళ్లు కలిసున్నా వేరుపడక తప్పదు : జైపాల్‌రెడ్డి
హైదరాబాద్‌, అక్టోబర్‌ 19 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణపై కొందరు వెనక్కి తగ్గినా ప్రత్యేక రాష్ట్రం తథ్యమని అన్నారు. విభజన తర్వాత రెండు ప్రాంతాల మధ్య మరింత సహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. విభజనపై ఎలాంటి అపోహలు వద్దని, సమస్యలు ఏమైనా కూర్చొని మాట్లాడుకుందా మన్నారు. తెలంగాణ సమస్యపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ సాహసోపేత నిర్నయం తీసుకు న్నారని అన్నారు. సోనియా నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం అని తెలిపారు. శనివారం పాతబస్తీలో నిర్వహించిన రాజీవ్‌గాంధీ సద్భావన సభలో జైపా ల్‌రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ పోరాటం న్యాయ మైనదని అన్నారు. తెలంగాణ పోరాటం 45 ఏళ్లుగా సాగుతోందని.. తెలంగాణ సమస్యపై సోనియా తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని వ్యాఖ్యానిం చారు. కాంగ్రెస్‌ పార్టీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోదని చెప్పారు. అన్ని ఆలోచించి, అందరినీ సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుందని తెలిపారు. విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీని తప్పుబట్టడం సరికాదన్నారు. విభజన వల్ల సీమాం ధ్ర ప్రజలకు, ఉద్యోగులకు ఎలాంటి నష్టం వాట ిల్లదన్నారు. ఏమైనా అపోహలు ఉంటే కూర్చొని చర్చించుకుందామన్నారు. నిధుల పంపిణీలో అన్యాయం జరుగుతుందని భావించడం పొరపాటేనని తెలిపారు. విభజన తర్వాత తెలంగాణ, సీమాంధ్రుల మధ్య సద్భావన మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమని జైపాల్‌ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటుకు ముందే నగరం దేశంలో ఐదో అతిపెద్ద నగరంగా ఉందన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో ఒక్క సీమాంధ్రులదే కాకుండా గుజరాతీ, మరాఠీ, బెంగాలీల పాత్ర ఉందన్నారు. హైదరాబాద్‌ను నిర్మించిన వారే దాన్ని తీసుకెళ్లలేదు. మధ్యలో వచ్చిన విూరెలా తీసుకెళ్తారని సీమాంధ్రులను ప్రశ్నించారు. మానవజాతి పుట్టక ముందే కృష్ణ, గోదవారి పుట్టాయి.. వాటిని ఎవరూ ఎప్పుడు దోచుకోలేరు, వాటిని విూరెలా తీసుకెళ్తారని అడిగారు. విభజనపై కేవలం అపోహలు మాత్రమే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భవిష్యత్‌లో ఇరు ప్రాంతాల ప్రజల మధ్య సామరస్య పూర్వక వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. వెయ్యేళ్లు కలిసున్నా విడిపోక తప్పదని, అందుకే అందరూ అవగాహనకు వచ్చి విడిపోదామని సూచించారు. కొంత మంది అడ్డుపడినా తెలంగాణ ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. యూపీలో మతం పేరిట ప్రజలను విభజించేందుకు యత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కొందరికి ఎన్నికలు వచ్చినప్పుడే మందిరాలు గుర్తుకొస్తాయని జైపాల్‌ పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. మనుషుల మనసు, ఆలోచనా విషయాల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *