Tuesday, 3 November 2026

విభజనపై శాఖల వారీగా నివేదికలు కోరాం


ఈ మెయిల్లను క్రోడీకరిస్తున్నాం
7న తిరిగి సమావేశం : షిండే
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 19 (జనంసాక్షి):
రాష్ట్ర విభజన అంశంపై ఆంధప్రదేశ్‌ అన్ని విభా గాల నుంచి శాఖలవారీగా వివరణాత్మకమైన నివేదికలు ఇవ్వాలని కోరామని కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చెప్పారు. ఈ మేరకు రాష్ట్రం నుంచి వివరాలు తెప్పించు కుంటున్నామని అన్నారు.  శనివారం పార్లమెం టు నార్త్‌బ్లాక్‌లో జరిగిన కేంద్రమంత్రుల బృందం సమావేశం అనంతరం షిండే మీడియాతో మాట్లాడారు. మంత్రుల బృందానికి అందిన సమాచారాన్ని ఆయా శాఖలకు పరిశీలనకు పంపుతామని చెప్పారు. రాష్ట్ర విభజనపై రెండువేల ఈ-మెయిళ్ల ద్వారా తమకు పలు సూచనలు వచ్చాయన్నారు. ఆంధప్రదేశ్‌ విభజనపై ఏర్పాటయిన కేంద్రమంత్రుల బృందం సమావేశం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 7న మంత్రుల బృందం తిరిగి సమావేశం కానుంది. రాష్ట్ర విభజన అంశంపై రెండువేల ఈ-మెయిళ్లు వచ్చాయన్న  కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే వాటిని పరిశీలిస్తామని తెలిపారు. వీటి ద్వారా పలు సూచనలు వచ్చాయన్నారు. మెయిళ్ల పరిశీలనకు సమయం పడుతుందని.. వాటిని ఏపీ, కేంద్ర అధికారులు కలిసి క్రోడీకరిస్తారని చెప్పారు. ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో కేంద్రమంత్రుల బృందం సమావేశం ముగిసింది. గంటన్నర పాటు- జరిగిన ఈ సమావేశంలో విభజన అంశం, తెలంగాణ ఏర్పాటు-పై ప్రధానంగా చర్చించారు. విభజన అంశంపై ఆంధప్రదేశ్‌ అన్ని విభాగాల నుంచి వివరణాత్మకమైన నివేదికలు ఇవ్వాలని కోరినట్లు షిండే  తెలిపారు.వచ్చేనెల 7వ తేదీన మంత్రుల సమావేశం జరుగుతుందని షిండే వెల్లడించారు. కాగా, అనారోగ్యంతో ఈసారి కూడా మంత్రి ఏకే ఆంటోని హాజరుకాలేదు. తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందం శనివారం ఇక్కడ సమావేశమయ్యే ముందు హై డ్రామా సాగింది. సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ¬ం శాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే రాగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు వేణుగోపాల్‌ రెడ్డి, శివప్రసాద్‌, నిమ్మల కిష్టప్ప, నారాయణ ఆయనను అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన వల్ల అనేక సమస్యలు వస్తాయని టీడీపీ ఎంపీలు షిండేకు వివరించారు. షిండే స్పందిస్తూ.. చంద్రబాబే విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని స్పష్టం చేయడంతో వారు షాక్‌ తిన్నారు. కావాలంటే వెళ్లి చంద్రబాబునే అడగండంటూ చెప్పారు. సీమాంధ్ర సమస్యలను పరిశీలిస్తామని హామి ఇచ్చిన షిండే అక్కడి నుంచి నిష్క్రమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *