Tuesday, 3 November 2026

పనికిమాలిన సమైక్య దీక్షలు పట్టించుకోం


ఘాటుగా స్పందించిన బొత్స
విజయనగరం, అక్టోబర్‌
20 (జనంసాక్షి):
ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని కోరుతూ పనికిమాలిన వాళ్లు చేపట్టిన దీక్షలను తాము పట్టించుకోబోమని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆది వారం జిల్లాలోని గరివిడిలో గల తన క్యాంపు కార్యాలయంలో బొత్స జేఏసీ నాయకులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తీర్మానాన్ని అసెంబ్లీలో అడ్డుకోవాలని ఈ సందర్భంగా జేఏసీ నేతలు కోరగా తాను కూడా సమైక్యవాదినేనని, అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని బదులిచ్చారు. విజయనగరం ఎంపీ, బొత్స సతీమణి ఝాన్సీ ఎంపీ పదవికి రాజీనామా చేయకపోవడంపై జేఏసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయగా, పార్లమెంట్‌లో సీమాంధ్ర ప్రజల వాణిని వినిపించేందుకే రాజీనామా చేయలేదని నచ్చజెప్పారు. సమైక్యాంధ్ర కోసమంటూ టీడీపీ, వైఎస్సార్‌ సీపీ అధినేతలు చంద్రబాబు, జగన్‌ చేస్తున్న దీక్షలతో ఎలాంటి ఫలితం ఉండదని బొత్స పేర్కొన్నారు. వాళ్లు చేస్తున్నవి పనికిమాలిన దీక్షలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *