Tuesday, 3 November 2026

రష్యా, భారత్‌ మైత్రి ధృడమైనది

కష్టకాలాల్లో ఆదుకున్నది సోవియెటే : మన్మోహన్‌
పలు కీలక అంశాలపై ఒప్పందం
ప్రధాని మన్మోహన్‌కు డాక్టరేట్‌ ప్రదానం
మాస్కో, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) :
రష్యా, భారత్‌ మైత్రి ఎంతో ధృడమైనదని భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేర్కొన్నారు. సోమవారం మాస్కో స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌లో ఆయన ఉపన్యసించారు. భారత దేశ వనరులు పరిమితంగా ఉండి, కొద్ది మంది మిత్రులు మాత్రమే ఉన్నప్పుడు ఎదురైన అంతర్జాతీయ సవాళ్ల కాలంలో రష్యా అండగా నిలబడిన విషయాన్ని తాము ఎన్నటికీ విస్మరించలేమని ఆయన తెలిపారు. ”అప్పట్లో మా వనరులు పరిమితంగా ఉండేవి. కొద్ది మంది మిత్రులు మాత్రమే ఉండేవారు. అలాంటి క్లిష్ట సమయంలో అంతర్జాతీయంగా పెను సవాళ్లు ఎదురైనప్పుడ రష్యా మాకు అండగా నిలబడింది. మా దేశానికి అన్ని రకాల సహాయాన్ని రష్యా అందజేసింది. ఈ విషయాన్ని భారతీయులు ఎప్పటికీ మరిచిపోరు” అన్నారు. ఈ కారణంగానే రష్యా మైత్రిని అత్యంత విలువైనదిగా పరిగణిస్తారని ప్రధాని మన్మోహన్‌ చెప్పారు. గడిచిన ఆరు దశాబ్ధాలకు పైబడి భారత్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్న ఏకైక దేశం రష్యా మాత్రమేనని, భారతీయులలో విశ్వాసాన్ని, అభిమానాన్ని, నమ్మకాన్ని చూరగొన్న దేశం కూడా రష్యా మాత్రమేనని ప్రధాని మన్మోహన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు ఈ సంస్థ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *