
తీర్మానం అసెంబ్లీకి వస్తుందో.. రాదో..
షిండేను అడిగిచెబుతా : దిగ్విజయ్
న్యూఢిల్లీ, అక్టోబర్ 21 (జనంసాక్షి) :
విభజనపై తొందరపడి సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేయవద్దని, ఏవైనా సమస్యలుంటే మంత్రుల బృందం (జీవోఎం)కు చెప్పుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సూచించారు. ఆయన ఢిల్లీలో విూడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. విభజనకు చెందిన సీమాంధ్ర ప్రాతానికి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయవద్దని, ఈ విషయంలో తొందరపడొద్దని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. విభజన నిర్ణయం సీమాంధ్ర ప్రాంత ప్రతినిధులకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ.. సమస్య పరిష్కారానికి అందరం కలిసి కృషి చేయాలని ఆయన కోరారు. తెలంగాణ తీర్మానంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఇదే అంశంపై కేంద్ర ¬ం మంత్రి షిండే మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కోరినట్టు చెప్పారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసేముందు.. అధిష్టానానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని హావిూ ఇచ్చారన్నారు. అందువల్ల రాజీనామాలపై తొందరపడొద్దని ఆయన కోరారు. తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని సీమాంధ్ర నేతలు ఇచ్చిన హావిూని గుర్తుపెట్టుకోవాలన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, విద్యాసంస్థలు కావాలన్న పనబాక లక్ష్మి డిమాండ్‌ను స్వాగతిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వస్తుందో లేదోనని.. ఈ విషయమై ¬ం మంత్రి షిండే అపాయింట్‌మెంట్ కోరానని తెలిపారు. విభజన తుపాన్‌ను ఆపుతానన్న సీఎం వ్యాఖ్యలపై దిగ్విజయ్ సమాధానం దాటవేశారు. ఆంధప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో రాష్టాన్రికి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ సమావేశం ముగిసింది. 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. ఇకపోతే.. పైలిన్‌ను ఆపలేదు కానీ.. విభజన తుఫాను ఆపుతామన్న సీఎం కిరణ్ వ్యాఖ్యలపై విలేకరుల అడగ్గా.. దిగ్విజయ్ నవ్వి ఊరుకున్నారు.
సమస్యలుంటే జీవోఎంకు చెప్పండి




