Tuesday, 3 November 2026

మూడేళ్లే ఉమ్మడి రాజధాని


హైదరాబాద్‌పై
కిరికిరి వద్దు
రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఆంక్షలు వద్దు
జీవోఎంను కోరుతాం : కోదండరాం
హైదరాబాద్‌, అక్టోబర్‌ 23 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ను మూడేళ్లే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని, ఎలాంటి కిరికిరి పెట్టొద్దని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదం డరామ్‌ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని శేరిలింగంపల్లిలో గ్రేటర్‌ హైదరాబాద్‌ టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మంత్రుల కమిటీ-మన డిమాండ్లు’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్రం కర్ర పెత్తనాన్ని అంగీకరించబోమని, సంపూర్ణ అధికారులున్న ప్రత్యేక రాష్ట్రమే కావాలని డిమాండ్‌ చేశా రు. తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరబాద్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే నిర్ణయం సరైంది కాదని ఆయన అభిప్రాయ ుపడ్డారు. ఉమ్మడి రాజధానిగా మూడేళ్లకాలం సరిపోతుందని, ఆలోగా సీమాంధ్ర ప్రాంతంలో కొత్త రాజధాని ఏర్పాటు చేస్తే ఆ నగరం సైతం సుహృద్భావపూర్వక వాతావర ణంలో అభివృద్ధి చెందే అవకాశముందని అన్నారు. కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ ఆజామాయిషీని తాము అంగీకరిం చబోమని ఆయన పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాలకు సంపూర్ణ అధికారులు ఇవ్వాలని, సీమాంధ్రకు అన్ని హంగులున్న కొత్త రాజధానిని త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌, తెలంగాణపై కేంద్రం ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని మంత్రుల కమిటీని కోరామన్నారు. టీ జేఏసీ ఆధ్వర్యంలో ఇదివరకే మంత్రుల కమిటీకి నివేదిక సమర్పించామని తెలిపారు. పోలవరం డిజైన్‌ మార్చాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. ఖమ్మం జిల్లాలో 276 గిరిజన గ్రామాలను ముంపునకు గురిచేస్తున్న పోలవరం ప్రాజెక్టును నిపుణులు సైతం వద్దంటున్న విషయం ఆయన గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *