Tuesday, 3 November 2026

ముంబై దాడిపై ఎందుకు విచారణ జరుపలేదు


నవాజ్‌ను నిలదీసిన ఒబామా
వాషింగ్టన్‌, అక్టోబర్‌ 24 (జనంసాక్షి) :
కాశ్మీర్‌ విషయంలో జోక్యం చేసుకోండని అడగానికి వచ్చిన పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌.. అమెరికా అధ్యక్షుడు బరా క్‌ ఒబామా నుంచి అనుకోని ప్రశ్న ఎదుర్కోవాల్సి వచ్చింది. 2008 ముంబై దాడుల నిందితులపై విచారణ ఎందుకు ప్రారంభించలేదని షరీఫ్‌ను ఒబామా నిలదీశారు. అంతేకాక సీమాంతర ఉగ్రవాం, ఉగ్రవాద సంస్థ జమాత్‌ ఉద్‌ దవా కార్యకలాపాలపై ఆరా తీశారు. వైట్‌హౌజ్‌లో ఒబామాను కలిసి రెండు గంటల పాటు చర్చించిన అనంతరం ఈ విష యాన్ని నవాజ్‌ షరీప్‌ వెల్లడించారు. భారత్‌తో సంబంధా లు, కాశ్మీర్‌ అంశం కూడా తమ మధ్య చర్చకు వచ్చిందని షరీఫ్‌ తెలిపారు. ముంబై దాడుల నిందితుల విచారణపై, ఒసామా బిన్‌ లాడెన్‌ ఆచూకీ తెలిపిన తర్వాత నిర్భంధంలో ఉన్న డాక్టర్‌ షకీల్‌ అఫ్రిది గురించి కూడా ఒబామా ప్రశ్నించినట్లు షరీఫ్‌ తెలిపారు. కానీ ఇతర వివరాలు వెల్లడింలేదు. అనంతరం ఒబామా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భారత్‌-పాక్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడడానికి షరీఫ్‌ విజ్ఞతతో అడుగులు వేస్తున్నారని కొనియాడారు. ఆయుధ కొనుగోలుకు వినియోగించే నిధుల్ని సామాజిక అభివృద్ధికి ఖర్చు చేస్తే ఉపఖండంలో శాంతి నెలకొంటుందని ఒబామా అభిప్రాయపడ్డారు. ఉగ్రవాద నిర్మూలనకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడానికి అంగీకరించామన్నారు. చర్చల అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దక్షిణాసియాలో నిలకడైన అభివృద్ధి సాధించడానికి అన్ని పక్షాలు నిరంతరాయంగా కృషి చేయాలని ఇరుదేశాలు తీర్మానించాయి. అయితే అమెరికా ద్రోన్‌ దాడులు, కాశ్మీర్‌సమస్యపై మాత్రం ఒబామా నుంచి ఏ విధమైన హామీ షరీఫ్‌కు దక్కలేదని తెలుస్తోంది. అంతేకాక కాశ్మీర్‌ సమస్యను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని అమెరికా ఇంతకుముందే స్పష్టం చేసింది. కాగా, ఈ మధ్యనే ముగిసిన ఐరాస సర్వసభ్య సమావేశంలో , ఒబామాను కలిసినప్పుడు భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పాక్‌ ఉగ్ర ప్రేరేపిత చర్యలను ప్రస్తావించడం ఇప్పుడు ఒబామా షరీఫ్‌ను ప్రశ్నించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *