Tuesday, 3 November 2026

ముజాఫర్‌ నగర్‌ అల్లర్ల బాధితులను పాక్‌ కలుస్తోంది

ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే దేశం నష్టపోతుంది
మధ్యప్రదేశ్‌ మాదే : రాహుల్‌
భోపాల్‌,అక్టోబర్‌ 24 (జనంసాక్షి) :
ముజాఫర్‌ నగర్‌ అల్లర్ల బాధితులను పాక్‌ కలుస్తోందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ  పేర్కొన్నారు. గురువారం మధ్యప్రదేశ్‌ లోని సాగర్‌ నియోజక వర్గం ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడా రు. విద్వేష రాజకీయాలు దేశ లౌకికతత్వాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయ న ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మతతత్వ రాజకీయాలకు పాల్పడు తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని, ఇలా చేయడం వల్ల దేశానికి తీవ్ర నష్టం జరిగుతుందని పేర్కొన్నారు. ముజఫర్‌నగర్‌, గుజరాత్‌, కాశ్మీర్‌ వెళ్లి నిప్పు పెట్టారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని  చెప్పారు. మేం గ్రామాల్లో తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటుంటే బీజేపీ మా పార్టీని ఎగతాళి చేస్తుంది. ఏసీ రూంల్లో కూర్చుని రాజకీయాలు నడుపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తభారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇండియా వెలిగిపోయిందని పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం చేసుకుంటున్నారని, ఎక్కడ వెలిగిందో చెప్పాలని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.  తాను మాత్రం గ్రామాల్లో తిరుగుతుంటే బీజేపీ నేతలు ఎగతాళి చేస్తున్నారని, కాని ఒక ఉత్తమ నాయకుడు అనేవాడు ప్రజల్లో తిరిగి, ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారు? ఎలా ఆలోచిస్తున్నారు? ఎటువంటి మాటలకు స్పందిస్తున్నారు, మొదలైన అంశాలను లోతుగా తెలుసుకోవాలని, అప్పుడే అసలైన నాయకుడు బయటకు వస్తాడని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని రాహుల్‌గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *