Tuesday, 3 November 2026

రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు


12 మంది మృతి
మరో రెండు రోజులు అల్పపీడన గండం
హైదరాబాద్‌, అక్టోబరు 24 (జనంసాక్షి) :
రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం అతలా కుతలం అవుతోంది. ఇప్పటి వరకు నాలుగు లక్షల ఎకరాల పంట నీట మునిగినట్లు అధి కారులు అంచనా వేశారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 40సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలు లేక అల్లాడుతున్న నల ్లగొండ, మహబూబ్‌నగర్‌, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో కుంభవృష్టి కురి సింది. అన్ని జిల్లాల్లో వర్షం వరదై పారింది. కోస్తాంధ్ర ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. దక్షిణ కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో పరిసర ప్రాంతంలో అల్పపీడనం స్ధిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబం ధంగా ఉపరితల ఆవర్తనం కదులుతోంది. వీటికి తోడు ఈశాన్య రుతుపవనాలు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని కొ న్ని జిల్లాల్లో చురుగ్గా కొనసాగుతుండడం తో శనివారం వరకు కోస్తా, రాయలసీమ జిల్లాలతో పటు తెలంగాణలో కూడా పలు చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తీవ్ర స్థాయి హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి గురువారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి ఫోన్‌ చేశారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించి అధికారులు అందుబా టులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోస్తాంధ్ర తీరం వెంట 60 నుంచి 70కి.మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్య కారులకు నాలుగు రోజుల ముందే హెచ్చరి కలు జారీ చేశారు. సహాయక చర్యలకు ప్రత్యేక అధికారులను నియమించాలని ము ఖ్యమంత్రి ఆదేశించారు. రోడ్ల మరమ్మతుకు ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్యకార్య దర్శి శ్యాం బాబు, విద్యుత్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం. సాహు, మంచినీటి సమస్య పరిష్కారానికి వికాస్‌రాజ్‌, నిత్యావసర సరుకుల సరఫ రాకు శమీర్‌శర్మ, నీటిపారుదలకు ఆదినా థ్‌దాత్‌, పోలీసు, అగ్నిమాపక శాఖలకు శివశంకర్‌, వ్యవసాయ రంగ పనులకు హునేతలను నియమించారు. వారు నిత్యం టెలికాన్షరెన్స్‌ల ద్వారా అధికారులను అప్రమత్తం చేస్తారు. మంగళవారం నుంచి గురువారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. శ్రీకాకు ళం జిల్లాలో 20సెం.మీటర్లు, సోంపేట, ఇచ్చాపురంలో 20సెం.మీటర్లు,  తూ.గోలో 17సెం.మీటర్లు, కృష్ణా, గుంటూరు, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ప్రకాశం, నల ్లగొండ, చిత్తూరు జిల్లాల్లో పదిసెంమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం నాటికి వైజాగ్‌లో ఆరు సెంటిమీటర్లు, హైదరాబాద్‌లో రెండు సెం.మీటర్లు, కాకినాడలో ఎనిమిది, కర్నూలులో మూడు, రామగుండంలో ఐదు సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఏదేమైనా మరో 48గంటల పాటు వర్షం ఇలాగే కొనసాగే పరిస్థితులు కనిపించడంతో ప్రజలు, ప్రభుత్వం భయాందోళనల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కాగా, భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *