
సీమాంధ్ర నేతలకు స్పష్టం చేసిన దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ, అక్టోబర్ 24 (జనంసాక్షి)
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ క మిటీ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజ య్‌సింగ్ అన్నారు. సీమాంధ్రకు చెం దిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆయ నతో గురువారం సమావేశమయ్యా రు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఉండే వారందరికీ రక్షణ కల్పిస్తామన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాల కో సం ఉత్తమమైన మార్గాన్ని అనుసరిస్తా మని ఆయన వెల్లడించారు. సీమాంధ్ర విద్యార్థులకు హైదరాబాద్‌లో విద్యావకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నీటి పంపకాల విషయంలోనూ ఇరుప్రాంతాల వారికి లబ్ధ చేకూరేలా కృషి చేస్తామన్నారు. విద్యా ఉద్యోగాలు వనరుల పంపకం విషయంలోనూ సామరస్యంగా పరిష్కరిస్తారాన్నారు.
తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్




