
బెంగాల్, ఒడిశాలలో ముంచెత్తిన వరుణుడు
సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
మరో 36 గంటలు వర్షాలు
హైదరాబాద్, అక్టోబర్ 26 (జనంసాక్షి) :
రాష్టాన్రికి జలగండం పట్టుకుంది. ఐదారు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో రాష్ట్రం అతలాకుతలం చేస్తున్నాయి. బెంగాల్, ఒడిశాలలోనూ వరుణుడు ముంచెత్తాడు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగు లువంకలు పొంగి పొర్లుతున్నాయి. తత్ఫలితంగా చెరువులకు గండ్లు పడుతున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రోడ్డుపైనుంచి నీరు ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా ప్రధాన రహ దారులు తెగిపోయి రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతోంది. నల్గొండ డిల్లా కట్టంగూర్ గ్రామ చెరువుకు గండి పడడంతో గతరాత్రినుంచి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తుండడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రాత్రి 8గంటల నుంచి ఇప్పటివరకు 8 గంటలవరకు కూడా వరద ఉదృతి తగ్గక పోవడంతో వాహనాలను నిలిపివేశారు. జాతీయ రహదారిపై కుప్పలు తెప్పలుగా వాహనాలు నిలిపి వేసి ఉంచారు. పిల్లా పాపలు, పెద్దలు, వృద్దులు అనే తేడా లేకుండా ఆర్టీసి, ప్రైవేట్ తిండి తిప్పలు లేక ఆహాకారాలు పెట్టారు. 9 గంటల సమయంలో కాస్తా వరద తగ్గడంతో పోలీసులు, గ్రామస్థులు కవచంగా నిలుచుని ఒక్కొక్క వాహనాన్ని పంపిస్తున్నారు. ఈట్రాఫిక్ క్లియర్ కావడానికి కనీసం మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. గ్రామంలో ఇటు 8 కిలోవిూటర్లు, అటు 8 కిలోవిూటర్ల పొడవువరకు కూడా వాహనాలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లా ఆత్మకూర్ మండలంలో కూడావర్ష భీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని జైలు గోడ కూలిపోయింది. ఖైదీలకు ప్రమాదం తప్పింది. జిల్లాలో 20 మండలాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో సమస్యతీవ్రంగా ఉంది. తిరుమలగిరివద్దకూడా వరద తీవ్రంగా ఉండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. నిండి పొంగి పొర్లడంతో శ్రీశైలం వైపు వెల్లేవాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా వరద పరిస్థితి ఇలాగే ఉండడంతో సమస్య తీవ్రంగా ఉంది. కృష్ణా జిల్లాలో వరద ప్రాంతాలను పరిశీలిం చేందుకు రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి చేరుకున్నారు. వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో విజయవాడ పట్టణంలో మకాం వేసిన ఆయన అధికారులతో సవిూక్షిస్తున్నారు. ప్రకాశం బ్యారెజికి నీరు బాగా వస్తుండడంతో 70 గేట్లు ఎత్తివేసి 2.70లక్షల క్యూసెక్కులనీటిని క్రిందకు వదులుతున్నారు. మోత్కుర్ వద్ద మూసీ నదితీవ్రంగా ప్రవహిస్తోంది. ఈప్రవాహంలో ఆటోచిక్కుకు పోవడంతో ఇందులో 14మంది ప్రయాణీకులున్నారు. వారు తమను ఆదుకోవాలంటూ ఆర్తనాదాలుపెడుతున్నారు. గ్రామస్తులు, అదికారులు వారిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ గౌరవెల్లి శివారులో చెరువుకు గండి పడడం తో హన్మకొండ- సిద్దిపేట ప్రధాన రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో పెద్దఎత్తున ట్రాఫిక్ కు అంతరాయంకలిగింది. వరద ప్రభావం 8గంటల సమయంలో ప్రారంభమైనా గంటలోపే రోడ్డు దాటలేనంత వేగంగా వరద తీవ్రంగా ఉంది. వరంగల్‌నుంచి జనగాం వెల్లే రహదారిపై కూడా ట్రాఫిక్ జామ్ అయింది. గుంటూరుజిల్లా నల్లమడుగువాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో 8 గ్రామాల ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. సింగరేణి విస్తరించి ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ వర్షాలవల్ల ఉత్పత్తికి విఘాతం కలిగింది. జనగాం మండలం యశ్వంతపూర్ వద్ద భారీ చెట్టు విరిగి పడి పోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం గలుగుతోంది. నల్గొండ జిల్లాలో 220 కోట్ల రూపాయలమేరకు నష్టం సంభవించినట్లు జిల్లా కలెక్టర్ చిరంజీవులు ప్రాథమికంగా పేర్కొన్నారు. నష్టం అంచనాలు వేసేందుకు టీంలను సిద్దం చేశామని, అయితే వర్షాలు పెద్దఎత్తున ఉండడంతో అంచనాలు వేయలేకపోతున్నామన్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టాయి. వరంగల్ నుంచి నల్గొండ, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలకు వెల్లే రహదారులన్నీ కూడా మూసుకు పోయాయి. జిల్లాలో 6వాగులు పొంగి పొర్లుతుండగా, 15 చెరువులు గండిపడే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ధర్మారావుపే ట-గణపురం మధ్య వాగులు పొంగి పొర్లుతుండడంతో వాహనాలు నిలిచిపోయాయి. 20 గ్రామాలకు రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పొట్లపల్లిలో చెరువుకు గండి పడడంతో హుస్నాబాద్‌లోని ఇళ్లల్లోకి వరద నీరువచ్చి చేరుతోంది. ఏలూరు-కైకలూర్ మధ్య రహదారిపైనుంచి వరద భారీగా ప్రవహిస్తుండడంతో వాహనాలన్నింటిని నిలిపివేశారు. దీంతో సుమారు అయిదు కిలోవిూటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా గుండాల మండలంలోని చెరువుకు గండి పడడంతో హైదరాబాద్ వెల్లే వాహనాలు నిలిచిపోయాయి. వరద తీవ్రంగా ఉండడంతో వాహనాలను అధికారులు నిలివేసి సవిూక్షిస్తున్నారు. అటువైపు వచ్చిపోయే వాహనాలన్నింటిని ఇరువైపులా నిలిపివేశారు. వరంగల్ జిల్లాలో ఇళ్లు కూలడంతో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని నల్లచెరువు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పిఅండ్ టీ కాలనీలో కూడా మూడు రోజులుగా వరదల వల్ల ఇళ్లల్లోకి నీరు చేరి అలాగే నిలిచిపోయింది. దీంతో కాల నీల్లోని వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెల్లారు. అధికారులు మాత్రం వచ్చి చూసిన పాపాన పోవడంలే దని ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలని వంద గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. 200 చెరువులకు పైగా గండ్లు పడ్డాయని అధికారులు పేర్కొన్నారు. భారీగా వర్షాలు కురుస్తుండడంతో పాఠశాలలకు ప్రభుత్వం సెల వు ప్రకటించింది.వాగులు వంకలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. విశాఖ వేములపూడి వద్ద చెరువుకు గండి పడ డంతో రోడ్డుపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా జిల్లా నందిగామ మండలం పరిటాల వద్ద వాగులు పొంగిపొర్లడంతో పెద్దఎత్తున పంట నీళ్లపాలైంది. జిల్లాలో వరదలవల్ల తల్లి- కుమారుడు ఇద్దరు కొట్టుకుపోయారు. విశాఖలోని కోటఊరుట్లలో తహశీల్దార్ కార్యాలయం కుప్ప కూలిపో యింది. నిజామాబాద్ జిల్లాలో 6600ఎకరాల్లో మొక్కజొన్న, వరి, పత్తిపంటలు నష్టపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాలు సిద్దం చేశారు. భువనగిరి సబ్‌జైలు గోడ కూలిపోవడంతో ఖైదీలను జిల్లా జైలుకు తరలించారు. అయితే ఆసమయంలో ఎవ్వరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టిన పెట్టుబడులు నీళ్లపాలయ్యాయి. చేతికి వస్తున్న సమయంలోనే వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. పత్తి తడిసి రంగు మారుతోంది. అలాగే కాయల నుంచి మొలకలు వస్తుండడం కూడా అన్నదాతను కుదిపి వేస్తుంది. ఎకరాకు పదివేల రూపాయలు, జిల్లాలో 35వేల హెక్టార్లలో వరి నష్టం సంభవించిందని తెలుస్తోంది. నాలుగున్నర లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని, పదివేల రూపాయలు క్వింటాల్‌కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరో 36 గంటలు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలపడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, బెంగాల్, ఒడిశాలలోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇళ్లలోకి నీరు చేరి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రానికి జలగండం




