
సమైక్య సభలో జగన్ అక్కసు
నవ్వులపాలైన జాతీయగీతం
హైదరాబాద్, అక్టోబర్ 26 (జనంసాక్షి) :
హైదరాబాద్ మాది కాదంటే తామంతా ఎక్కిడికి పోవాలని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పార్టీ నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. రాజకీయ చదరంగంలో తాము పావులం కాదని, ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఓట్ల కోసమో, సీట్ల కోసమో ప్రజల జీవితాలతో సోనియా రాజకీయం చేయటం మంచిది కాదన్నారు. ఒక్కటిగా ఉన్న రాష్టాన్న్రి కొడుకును ప్రధాని చేసేందుకు విభజించడం న్యాయం కాదన్నారు. స్వార్థం కోసం ప్రజల మధ్య చిచ్చు పెడతారా అని ప్రశ్నించారు. తుపాను, భారీ వర్షాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా జగన్ నివాళులర్పించారు. రాష్టాన్న్రి విభజిస్తే తమకు నీళ్లు ఎలా వస్తాయని రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారని తెలిపారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నిస్తూ ఎందరో అక్కాచెల్లెళ్లు ఉద్యమబాట పట్టారని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఇందరికి తట్టిన ఆలోచన సోనియాకు, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబుకు, ప్రజలను మోసం చేస్తున్న కిరణ్‌కు ఎందుకు తట్టలేదని ఆయన ప్రశ్నించారు. కళ్లుండి కూడా కబోదుల్లా వ్యవహరించిన చంద్రబాబు, కిరణ్, సోనియాలకు విభజిస్తే రాష్ట్ర దుస్థితి అర్థం కావట్లేదా అని నిలదీశారు. ఇప్టపికే కర్నాటక మహారాష్ట్రలతో నీటి పేచీలు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు విభజజిస్తే నీరు ఎక్కడి నుంచి వస్తుందన్నారు. చంద్రబాబు ఎందుకు విభజనకు మద్దతు పలికారని అన్నారు. సిడబ్ల్యూసి నిర్ణయం ప్రకటించిన వెంటనే సిఎం కిరణ్ ఎందుకు రాజీనామా చేయాలేదన్నారు. వారు ఆనాడే రాజీనామా చేస్తే ఈ గతి వచ్చేదా అన్నారు. భారత పౌరసత్వం తీసుకున్న సోనియాకు ఇక్కడి వారి బాధలేమి తెలుస్తాయని అన్నారు. పార్లమెంటులో చట్టం చేసి, పౌరసత్వం తీసుకున్న వారంతా వెళ్లిపోవాలని అంటే బాధ ఏంటో తెలుస్తుందన్నారు. 30 ఏల్లుగా ఉన్న విూకే బాధగా ఉంటే 60 ఏళ్లుగా ఉన్న మాకెంత బాధగా ఉంటుందని అన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలు రాష్టాన్రికి వెన్నుపోటు- పొడుస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు, కిరణ్ లక్ష్యంగా ఆయన తన ప్రసంగాన్ని సుధీర్ఘంగా కొనసాగించారు. అడగదలచుకున్న, అడగదలచుకున్న అంటూ అన్ని ప్రశ్నలే వేశారు. విభజనను ఆయన హిట్లర్ సృష్టించిన నరమేథంతో పోల్చారు. సోనియా విదేశీయతను జగన్ లేవనెత్తి ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. సీడబ్ల్యూసి తీర్మానం తర్వాత వెంటనే సీఎం కిరణ్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. బాబు అక్కడ ఢిల్లీలో దీక్ష చేస్తే కిరణ్ ఇక్కడ ఉద్యోగులతో సమ్మె విరమింపజేశారని విమర్శించారు. సమైక్య శంఖారావం సభలో జగన్ రెచ్చగొట్టేలా ప్రసంగించారు. సోనియా, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబును టార్గెట్ చేస్తూ జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాష్ట్ర విభజనను దేశ సమస్యతో ముడిపెడుతూ మాట్లాడారు. రాష్ట్రం విడిపోతే హైదరాబాద్‌లో ఆస్తుల విలువ పడిపోతుందని భయం పుట్టించారు. రాష్ట్రం విడిపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని సీమాంధ్ర నిరుద్యోగుల్లో భయం పుట్టించేలా మాట్లాడారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ఆస్తుల, భద్రతపై భయపెట్టించారు. రాష్ట్రం విడిపోతే నీటి సమస్యలు వస్తాయని సీమాంధ్ర రైతులను రెచ్చగొట్టేలా ప్రసంగించారు. అడగదలుచుకున్నా.. అడగదలుచుకున్నా అంటూనే అన్ని ప్రశ్నలే సంధించారు. వందేమాతర గేయాన్ని, విప్లవ జెండాను అందుకుంటాం.. మిమ్నల్ని బంగాళాఖాతంలో కలిపేస్తామని హెచ్చరించారు. ఇంతమంది ఎందుకు ఉద్యమం చేస్తున్నారని రాష్టాన్న్రి విభజించి తన కొడుకుని, ప్రధాని చేయాలనుకుంటున్న సోనియాకు తట్టలేదా అని ప్రశ్నించారు. ప్యాకేజీలు కోరుతున్న చంద్రబాబుకూ తట్టలేదు, మోసం చేస్తున్న సీఎం కిరణ్‌కు తట్టలేదు అని ఎద్దేవా చేశారు. ఆల్మట్టి,నారాయణపూర్ నిండనిదే కిందకు నీళ్లు ఎలా వస్తాయని ప్రజలను మోసం చేస్తున్న ఈ ముగ్గురినీ ప్రశ్నిస్తున్నానన్నారు. కర్ణాటక, తమిళనాడు ప్రతియేటా నీటి కోసం కొట్లాడుకుంటున్న పరిస్థితి తెలియదా, ట్రిబ్యునళ్లు, బోర్డులు ఏం చేయగలిగాయో తెలియదా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీళ్లు ఎలా వస్తాయని, మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్ట్‌లకు ఎక్కడ నుంచి నీళ్లు ఇస్తారని, నల్గొండ ఎస్ఎల్బీసీకి ఎక్కడ నుంచి నీళ్లు వస్తాయని, గాలేరునగరి, హంద్రీనీవాలకు నీళ్లు ఎక్కడ నుంచి ఇస్తారని, పోలవరం ప్రాజెక్ట్‌కు నీళ్లు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను 10ఏళ్లలో విడిచి వెళ్లమంటున్నారు. చదువు పూర్తయిన యువకులు సోనియా, బాబు, కిరణ్‌లను ఉద్యోగం కోసం కాలర్ పట్టుకుని అడిగితే ఏం సమాధానం చెబుతారన్నారు. వైఎస్ ఉన్నప్పుడు క్యాంపస్ ద్వారా ప్రతియేటా 50వేల ఉద్యోగాలు వచ్చేవి కానీ ఇప్పుడు ఆ సంఖ్య 25వేలకు మించడం లేదన్నారు. దేశంలోనే హిందీ తర్వాత అతిపెద్ద జాతి తెలుగుజాతి, సోనియాకు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా అన్నారు. తెలుగు జాతికి ద్రోహం చేస్తున్న సోనియా, చంద్రబాబు, కిరణ్‌లను క్షమించమని, 30 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందామన్నారు. ఢిల్లీ కోటను బద్దలు కొట్టి రాజకీయాలను మనమే శాసిద్దాం అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. మధ్యమధ్యలో యువకులు జై కొట్టడం విశేషం. కాగా, జగన్ సమైక్య శంఖారావం సభలో జాతీయగీతం నవ్వుల పాలు చేయడం తెలంగాణ వాదులు తీవ్రంగా మండిపడ్డారు. జాతీయ గీతం అవహేళన చేసిన జగన్‌పై కేసు పెడుతామని జేఏసీ నాయకులు పేర్కొన్నారు.
హైదరాబాద్ మాది కాదంటే ఎక్కడికి పోవాలి




