
నారాయణ
హైదరాబాద్, అక్టోబర్ 26 (జనంసాక్షి) :
విభజన ప్రక్రియను ఆపు తానన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యల పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఆయనవన్నీ ఉత్తర ప్రగల్బా లేనని ఎద్దేవా చేశారు. విభజన తుపాను కాదు.. ఏ తుపానును ఆయన ఆపలేరని అన్నారు. వరద బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. శనివారం నారాయణ విూడియాతో మాట్లాడుతూ.. సీఎం కిరణ్‌పై మండిపడ్డారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడం సీఎం వల్ల కాదన్నారు. విభజన ప్రకటనకు ముందు ముఖ్యమంత్రి ఏం చేశారని ప్రశ్నించారు. విభజన వల్ల సమస్యలు తలెత్తుతాయన్న ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సమస్యలన్నింటికీ కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కోరారు. ముఖ్యమంత్రి విభజన విషయం వదిలేసి.. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై దృష్టి సారించాలని చురకలంటించారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి త్వరలోనే సీఎంను కలుస్తామన్నారు. భారీ వర్షాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరతామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. వరద బాధితులకు సరైన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోందన్నారు. ఇప్పటికైనా వరదల్లో చిక్కుకున్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కిరణ్ తుపానును అడ్డుకోవడం ఒట్టిమాటే




