
కిరణ్‌కు చెక్ పెట్టేందుకు కేంద్రం ఎత్తుగడ
టీ ముసాయిదా సభకు వస్తే సాఫీగా నడిపేందుకు వ్యూహం
హైదరాబాద్, అక్టోబరు 26 (జనంసాక్షి):
తెలంగాణ ముసాయిదా బిల్లు, లేదా తీర్మానం అసెం బ్లీకి వస్తే దాన్ని అడ్డుకొని తీరుతామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను స్పీకర్ నాదెం డ్ల మనోహర్ అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నా యి. తీర్మానాన్ని ఓడించాలి.. లేదా రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టించి విభజన ప్రక్రియ ఆపొ చ్చని సీఎం వర్గం భావిస్తున్నప్పటికీ ఇది అంత తేలికైన పనికాదని, రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రికి ఆ అవ కాశమే లేదని స్పీకర్ కార్యాలయం వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వెలువడ్డాయి. తెలంగాణ అంశంపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుంటే కిరణ్‌కుమా ర్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్ అధిష్టానానికి కొరకురాని కొ య్యగా మారారు. ఈ వ్యవహారంలో కేంద్రం ఆచితూడి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని పక్కకు పెట్టి తన పని తాను చేసుకుంటూ పోతోంది. పైగా గవర్నర్ ఈఎల్ నరసింహన్, స్పీకర్ నాదెండ్ల మనోహర్‌లపై పూర్తిగా ఆధారపడి ప్రక్రియ కొనసాగిస్తోంది. మొదటి నుంచీ విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కిరణ్‌కు ఇది రుచిం చడలేదు. దీంతో సందర్భానుసారం ఆయన అధిష్టానంపై ధిక్కార స్వరం పెంచుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విభజనను అడుకొని తీరుతానని బహిరంగంగా ప్రకటించిన సీఎం.. తాజాగా శుక్రవారం రాష్ట్రపతి, ప్రధానిలకు లేఖ రాసి తన ధిక్కార స్వరం మరింత పెంచారు. రాష్ట్ర విభజన అంశంపై కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, రాజ్యాంగ సంప్రదాయాలను పాటించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు 2014వరకు విభజన జరగదని, అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడిస్తామని తనను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలతో చెబుతూ వస్తున్నారు. ఈ మేరకు ఆయన కొన్ని ఆంగ్ల పత్రికలకు లీకులు కూడా ఇచ్చారు. శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చినప్పుడు కిరణ్ ఉపన్యాసం చేసి, ఆ తర్వాత రాజీనామా చేస్తారని, తద్వారా రాజకీయ సంక్షోభం వస్తుందని ఆ లీకుల సారాంశం. కానీ స్పీకర్‌ను కొందరు కలిశారు. కానీ ఆయన అధిష్టానం మేరకు వెల్లడించారో.. లేక వాస్తవ పరిస్థితి తెలుసుకొని వ్యాఖ్యానించారో తెలియదు కానీ, తెలంగాణపై బిల్లు వచ్చినప్పుడు రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం లేదని ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. తెలంగాణ బిల్లు తయారయ్యాక కేంద్ర క్యాబినెట్ ఆమోదించి, దాన్ని రాష్ట్రపతి ద్వారా శాసనసభకు పంపుతారు. పది నుంచి పక్షం రోజుల్లోపు దానిపై అభిప్రాయాలు తెలియజేయాలని కోరతారని శాసనసభ స్పీకర్ కార్యాలయ వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వచ్చాయి. దాని ప్రకారం సభ జరిగితే ఆ మేరకే అభిప్రాయాలు తీసుకొని రాష్ట్రపతికి నివేదించాల్సి ఉంటుంది. సభ జరగకపోయినా అది సభకు వచ్చినట్టుగా పరిగణిస్తారని అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి రాజీనామా చేసినా..సభలో చర్చ ఆగదని కూడా స్పష్టం చేస్తున్నారు. ఏ రకంగా చూసినా రాష్ట్రాల ఏర్పాటు కేవలం పార్లమెంట్‌కు సంబంధించిన అంశంగానే ఉంది తప్ప శాసన సభ పాత్ర చాలా వరకు పరిమితంగా ఉంటుందని రాజ్యాంగంలోని అంశాల ఆధారంగా నిపుణులు ప్రస్తావిస్తున్నారు. మొత్తం మీద కిరణ్ వాదనను పూర్వపక్షం చేస్తూ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఆయన పేరుతో కాకుండా, కేవలం కార్యాలయ వర్గాలంటూ మీడియాలో విస్తారంగా కథనాలు రావడం గమనార్హం.
స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో కేంద్రం మంతనాలు




