
ఐఎం పనేనని తేల్చిన ఎన్‌ఐఏ
పాట్నా/న్యూఢిల్లీ, అక్టోబర్ 28 (జనంసాక్షి) :
బీహార్ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పురోగతి సాధించింది. ఇండియన్ ముజాహిదినే ఈ పేలుళ్లకు కారణమని తేల్చింది. అలాగే బీహార్ వరుస పేలుళ్ల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రద్దీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. పాట్నా పేలుళ్ల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో నిఘా, భద్రతను పెంచాలని సూచించింది. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, షాపింగ్‌మాల్స్‌కు భద్రత పెంచాల్సిందిగా ఆయా రాష్ట్రాల పోలీసులకు కేంద్ర ¬ం శాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. జన సమ్మర్థ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. పండగల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు, పేలుళ్ల వెనుక ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ హస్తం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. భత్కాల్ సోదరుల ఆదేశాల మేరకే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సభను టార్గెట్‌గా చేసుకొని పేలుళ్లు జరిపినట్లు తెలుస్తోంది. పాట్నా పేలుళ్లు, బుద్ధగయా పేలుళ్లకు సంబంధం ఉన్నట్లు దర్యాప్తు బృందాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇండియన్ ముజాహదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌కు సన్నిహితుడైన తైసిన్ అక్తర్ ఈ పేలుళ్లకు సూత్రధారుడిగా అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. సోమవారం మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్ సవిూపంలో మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు పాట్నా ఎస్పీ జయంత్ కాంత్ తెలిపారు. పేలుళ్లలో అతడి పాత్రపై ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఆదివారం అరెస్టు చేసిన ఇంతియాజ్ అన్సారీ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ, ఫోన్ నెంబర్లపై పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు, కేసు దర్యాప్తులో స్థానిక పోలీసులకు ఎన్‌ఐఏ అధికారుల బృందం సహాయ సహకారాలు అందిస్తోంది. పాట్నా పేలుళ్లకు, బుద్ధగాయ పేలుళ్లకు సంబంధం ఉన్నట్లు దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. రెండు ఘటనల్లో జరిగిన పేలుళ్లు ఒకే తరహాల ఉన్నాయని, టైమర్లు కూడా అలాగే ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు, పాట్నా వరుస పేలుళ్ల నేపథ్యంలో యాసిన్ భత్కాల్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఎన్‌ఐఏ నిర్ణయించింది. ఈ మేరకు తమ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరింది.
ఏడుకు చేరిన మృతుల సంఖ్య
పాట్నా పేలుళ్లలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరో వ్యక్తి కన్నుమూశాడు. ఆదివారం పాట్నాలో బీజేపీ నిర్వహించిన ‘హుంకార్’ సభ జరిగిన వరుస పేలుళ్లలో ఐదుగురు మృతి చెందగా, 83 గాయపడ్డారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో సోమవారం మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మరోవైపు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు.ఇదిలా ఉంటే, పేలుళ్ల ఘటన రాజకీయ రంగు పులుముకుంది. బీహార్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పేలుళ్లు చోటు చేసుకున్నాయని బీజేపీ నేత సుశీల్‌మోడీ ఆరోపించారు. భద్రత ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించిన ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కూడా నిందితుడేనని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదన్నారు.
బీహార్ పేలుళ్ల కేసు పురోగతి




