
హైదరాబాద్‌పై కాదు
న్యూఢిల్లీ,
అక్టోబర్ 28 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వా త పోలీస్ శాఖలో సమస్యల పరిష్కారానికే కేంద్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అయితే కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ హైదరాబాద్‌ను కేంద్ర పాలితప్రాంతంగా ప్రకటించడానికే అంటూ కొన్ని సీమాంధ్ర మీడియా సంస్థలు ఊదరగొట్టిన ప్రచారం ఉత్తదేనని కేంద్రం తేల్చిచెప్పింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభు త్వం శాంతిభద్రతల అం శంపై నివేదిక సమర్పిం చడానికి ఐదుగురు సభ్యుల తో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌పోర్స్‌కు సీనియర్ అధికారి విజయ కుమార్ నేతృత్వం వహిస్తారు. గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్ వేట కోసం వేసిన టాస్క్‌ఫో ర్స్‌కు ఆయనే నేతృత్వం వహించారు. ఆయన వీరప్పన్‌ను మట్టుబెట్టడంలో కీలకపాత్ర పో షించారు. ప్రస్తుం రిటైర్ అయ్యాక టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్నారు. విజయకుమార్ తమిళనాడుకు చెందినవారు. కాగా, ఈ కమిటీలో ఇద్దరు రాష్ట్రానికి చెందివారున్నారు. మాజీ డీజీపీ మహంతి, ఐపీఎస్ అధికారి జెవి రాముడు కమిటీలో ఉన్నారు. ఐఎఎస్ అధికారి రాజీవ్ శర్మ, ఐపీఎస్ అధికారి వాసన్ కూడా ఈ కమిటీలో ఉన్నారు. వీరు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ మంగళవారం హైదరాబాద్ చేరుకుంటుంది. శాంతిభద్రతలకు సంబంధించి టాస్క్‌ఫోర్స్ అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది.
విభజన తర్వాత పోలీస్ సమస్యల పరిష్కారానికే టాస్క్‌ఫోర్స్




