Tuesday, 3 November 2026

రాష్ట్ర విభజనలో జోక్యం చేసుకోలేం


ఆ అధికారం పార్లమెంట్‌దే
పిల్‌ కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్‌, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన అంశంలో తాము జోక్యం చేసుకోబోమని రాష్ట్ర హైకోర్టు తేల్చిచెప్పింది. కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్‌దే కాబట్టి తాము ఈ అంశంలో తలదూర్చబోమని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కల్యాణ్‌జ్యోతి సేన్‌ గుప్తా, జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం కొట్టేసింది. రాష్ట్ర విభజనపై తదుపరి నిర్ణయం తీసుకోవడానికి ముందు హైదరాబాద్‌ నగరాన్ని, పరిసర ప్రాంతాలను కలిపి దేశానికి రెండో రాజధానిగా ప్రకటించేలా కేంద్ర హోం మంత్రిత్వశాఖను ఆదేశించాలని కోరుతూ చిత్తూరు జిల్లాకు చెందిన మేజర్‌ పి. నర్సింహులు పిల్‌ దాఖలు చేశారు. హైదరాబాద్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే కేంద్ర ప్రభుత్వం విభజన నిర్ణయాన్ని తీసుకుందని, ఇది రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని పిటిషనర్‌ కోరాడు. కానీ ఆయన వాదనతో కోర్టు విభేదించి పిటిషన్‌ను కోట్టేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *