Monday, 2 November 2026

బొగ్గు స్కాంలో ప్రధానిని చేర్చాలన్న పిటిషన్‌ కొట్టివేత


న్యూఢిల్లీ, అక్టోబర్‌ 29 (జనంసాక్షి) :
బొగ్గు కుంభకోణం ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్‌ఐఆర్‌)లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేరును చేర్చాలన్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. బొగ్గు బ్లాకుల కేటాయింపులపై ప్రధాని అఫిడవిట్‌ దాఖలు చేయాలన్న అభ్యర్థననూ కోర్టు తోసిపుచ్చింది. బొగ్గు కుంభకోణం కేసు దర్యాప్తు అంశాన్ని సీబీఐ పర్యవేక్షిస్తుందని న్యాయస్థానం పేర్కొంది. బొగ్గు కుంభకోణంపై తాజా నివేదికను 2014 జనవరి 9లోగా సమర్పించాలని సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *