
న్యూఢిల్లీ, అక్టోబర్ 29 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం కసరత్తు మొదలు పెట్టిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. నవంబర్ 5 లోపు ఇరు ప్రాంతాల నేతలు, ప్రజలు తమ అభిప్రాయాలను మంత్రుల బృందానికి తెలుపవచ్చని చెప్పారు. ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు జీఓఎంకు తెలపాలని కోరారు. ఇరు ప్రాంతాల వారి అభిప్రాయాల ద్వారా స్పష్టత వస్తుంది వాటి ఆధారంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రుల బృందం రాష్ట్ర విభజనపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలకు కచ్చితంగా న్యాయం చేస్తామని పునరుద్ఘాటించారు. వారికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. విభజన అంశంపై మంత్రుల బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా బిల్లు తయారవుతుందన్నారు. పంపకాల విషయమై ఇప్పటికే వివిధ స్థాయిలో ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. రాజ్యాంగబద్ధంగానే రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తవుతుందన్నారు.ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం విభజన ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తయింది. సీడబ్ల్యూసీ, యూపీఏ నిర్ణయం వెలువడిన వెంటనే ¬ం శాఖ మౌఖిక ఆదేశాల మేరకు అధికారులు అవసరమైన సమాచారాన్ని సేకరించారు. క్యాబినెట్‌నోట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయగానే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటికే ముఖ్య విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన అధికారులు వాటిపై దృష్టి సారించారు. ప్రధానంగా శాంతిభద్రతలు, ప్రాజెక్టులు, అప్పులు-ఆస్తులు, సరిహద్దులు, మానవ వనరులు తదితర అంశాలపై ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం శాఖల వారీగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి విభజన ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే శాంతిభద్రతల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమైంది.
ఐదులోపే సమస్యలు జీవోఎంకు చెప్పండి : దిగ్విజయ్‌సింగ్




