Monday, 2 November 2026

రెండు రాష్ట్రాల్లో పటిష్టమైన పోలీస్‌ వ్యవస్థ


విభజన తదనంతర పరిణామాలపై టాస్క్‌ఫోర్స్‌ కీలకభేటీ
హైదరాబాద్‌, అక్టోబర్‌ 29 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ శాంతిభద్రతల పరిరక్షణకు మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ¬ం శాఖ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ మంగళవారం సమావేశమైంది. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌, కేంద్ర ¬ం శాఖ సలహాదారు విజయ్‌కుమార్‌ నేతృత్వంలో హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి, శిక్షణ సంస్థలో జరిగిన ఈ భేటీలో కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డీజీపీ బి.ప్రసాదరావు, మాజీ డీజీపీలు హెచ్‌జే దొర, కె.అరవిందరావు, ఏకే మహంతి, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ, అప్పా డైరెక్టర్‌ మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. విభజన అనంతరం తలెత్తే పరిణామాలు, శాంతిభద్రతల సమస్య, పోలీసు విభాగం విభజన సహా వివిధ అంశాలపై కమిటీ చర్చించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడే శాంతిభద్రతల సమస్యలపై టాస్క్‌ఫోర్స్‌ బృందం సమావేశంలో చర్చించింది. ఆస్తులు, ఎంప్లాయ్‌మెంట్‌, బెటాలియన్లు, పోలీసు అకాడమీ, ఆక్టోపస్‌, సరిహద్దు అంశాలపైనా ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. విభజన తర్వాత పోలీసు శాఖను విభజించే అంశంపై పలువురు సీనియర్‌ అధికారుల నుంచి సూచినలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి రాజధానిలో ఢిల్లీ తరహా పోలీసింగ్‌ వ్యవస్థ ఏర్పాటు వంటి అంశాలపై భేటీలో చర్చించినట్లు సమాచారం. ఉన్నతాధికారులు, ఐపీఎస్‌ల అభిప్రాయాలను కమిటీ సేకరించింది. భేటీ ముగిసిన అనంతరం ¬ం శాఖ సలహాదారు విజయ్‌కుమార్‌ విూడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు వైపులా శక్తివంతమైన పోలీసు విభాగాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసు విభాగంలో ఆస్తులు, సిబ్బంది పంపకాలపై అభిప్రాయాలు కోరామని చెప్పారు. ఇరు ప్రాంతాల్లోనూ పోలీసు శిక్షణ, రక్షణ సదుపాయాలపై అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం మరోసారి సమావేశం కానున్నట్లు విజయ్‌కుమార్‌ వెల్లడించారు. విభజన తర్వాత కూడా రెండు రాష్టాల్రు తగిన సామర్థ్యంతో పని చేసేందుకు అవసరమైన శిక్షణ, మౌలిక సదుపాయాల కూర్పుపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. తొలిరోజు కేవలం ప్రాథమిక సమావేశమే జరిగిందని.. బుధ, గురువారాల్లో సమావేశమై చర్చిస్తామన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అవసరమైన ప్రక్రియను వేగవంతం చేసింది. విభజన నేపథ్యంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహాలు, శాంతిభద్రతలు సమస్యలు, పోలీసు విభాగం విభజన వంటి అంశాలను పరిశీలించేందుకు గాను ¬ం శాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కేంద్ర ¬ం శాఖ భద్రత సలహాదారు విజయ్‌కుమార్‌ను నియమించింది.  ఆయనతో పాటు సభ్యులుగా కేంద్ర ¬ం శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్‌ శర్మ, జాతీయ దర్యాప్తు సంస్థ అదనపు డీజీ ఏఆర్‌ వాసన్‌, మధ్యప్రదేశ్‌ అదనపు డీజీ డీఎం మిత్ర, ఒడిశా ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ అభయ్‌కుమార్‌, సరిహద్దు భద్రతాదళం ఐజీ సంతోష్‌ మెహ్రా, సీఆర్పీఎఫ్‌ ఐజీ జుల్ఫికర్‌ హసన్‌, ¬ం శాఖ పర్సనల్‌ డైరెక్టర్‌ శంతను, బ్యూరో ఆఫ్‌ పోలీసు రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డీఐజీ అన్షుమన్‌ యాదవ్‌లు ఉన్నారు. వీరితో పాటు రాష్టాన్రికి చెందిన 13 మంది ఐపీఎస్‌ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం తొలిసారిగా కమిటీ సమావేశమైంది. కమిటీ సభ్యులతో పాటు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ఏకే ఖాన్‌, అజయ్‌ మిశ్రా, దామోదర్‌, జేవీ రాముడు, మిత్ర, సజ్జనార్‌ తదితరులు పాల్గొన్నారు. ఉన్నతాధికారులు, మాజీ డీజీపీల అభిప్రాయాలు సేకరించడంతో పాటు రాష్ట్ర విభజన వల్ల వచ్చే సమస్యలపై కమిటీ ప్రాథమికంగా చర్చించింది. పోలీసు శాఖ విభజన, పంపకాలు వ్యూహాలపై చర్చించేందుకు కమిటీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌ సోమవారం ఉదయం న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర విభజనకు సంబంధించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర విభజన అంశంపై తాను ప్రస్తుతం ఏవిూ మాట్లాడనని.. టాస్క్‌ఫోర్స్‌ బృందం సభ్యులు, ఉన్నతాధికారుల నుంచి నివేదికలు తీసుకున్నాక స్పందిస్తామన్నారు. హైదరాబాద్‌లో పరిస్తితిని అధ్యయనం చేయడానికే తాము వచ్చామన్నారు. విభజన పరిస్థితులపై చర్చలు ఎన్ని రోజులు జరుగుతాయో చెప్పలేనని. కాకపోతే అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *