Tuesday, 3 November 2026

ఘోర బస్సు ప్రమాదం


-45 మంది సజీవ దహనం
హైదరాబాద్‌: మహబూబ్‌ నగర్‌ జిల్లా  కొత్తకోట మండలంలో ఘోర విషాద సంఘటన సంభవించింది. పాలంలోని సాయిదాబా హోటల్‌ దగ్గర జాతీయ రహదారిపై జబ్బార్‌ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు వోల్వో బసుస ప్రమదావశాత్తు కాలిపోయింది. ఈ ఘటనలో ప్రయాణిస్తున్న సుమారు 40 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం జరిగినపుబు బస్సులో ఉన్న వారి సంఖ్యపై సందేహాలున్నా 49 మంది ప్రయాణీకులు ఆ బసుసలో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాద ఘటనలో అక్కడిక్కడే 40 మంది సజీవ దహనం కాగా ఆసుపత్రికి తీసుకెళ్తున్న దారిలో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 మరణించారు. బస్సు బెంగుళూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఇంజన్‌ భాగంలో చెలరేగిన మంటలు. క్షణాల్లో బస్సు అంతా అలుముకోవడంతో పూర్తిగా తగలబడింది. డ్రైవర్‌, క్లీనర్‌ ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు ఇద్దరినీ విచారిస్తున్నారు. ప్రమాద ఘటనా స్థలి దగ్గర పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. కాలుతున్న దేహాలతో భయానకంగా మారింది. మంటలంటుకోగానే బయటకు రావాలని ప్రయత్నించి విఫలమైన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పలువురు మహిళలు, పిల్లలు, వృద్దులు, నూతన దంపతులు మంటలకు పూర్తిగా ఆహుతులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *