Monday, 2 November 2026

అఖిలపక్షం నిర్వహించండి


షిండే ప్రకటనను స్వాగతించిన నారాయణ
సీఎం ధిక్కార స్వరం ఓ డ్రామా
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 30 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజన అంశంపై మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేను కోరామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. బుధవారం ఆయన షిండేతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరారు. సీమాంధ్ర ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించి వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహార శైలిపైనా నారాయణ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాష్ట్రాన్ని విభజిస్తే జల యుద్ధాలు వస్తాయని రెచ్చగొట్టేలా మాట్లాడడం, కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ లేఖలు రాయడం తదితర అంశాలను షిండే దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ¬ం మంత్రితో భేటీ ముగిసిన అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరామని చెప్పారు. సీడబ్ల్యూసీ ప్రకటన నేపథ్యంలో రాజకీయ పార్టీలు మాట తప్పాయని, ఫలితంగా రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే విభజనకు సంబంధించి మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని షిండేను కోరామన్నారు. అఖిలపక్షంలో ఎవరికి ఏం కావాలో, ఏ పార్టీ వైఖరి ఏమిటో తెలుస్తుందని చెప్పారు. ‘విభజనపై ప్రతిష్టంబన నెలకొన్న నేపథ్యంలో మరోమారు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. ప్రతి పార్టీ నుంచి ఒక్కరినే ఆహ్వానించాలి.. సీమాంధ్రకు ఏం కావాలో అడిగి తెలుసుకోవాలి. ఆ మేరకు ఆయా డిమాండ్లను నెరవేర్చి రాజ్యాంగబద్దంగా తెలంగాణ ప్రక్రియ పూర్తి చేయాలి’ అని సూచించారు. రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ముఖ్యమంత్రి కిరణ్‌ వ్యతిరేకంగా ఉన్నాడని విమర్శించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ ఆడుతున్న ఆటలో భాగంగానే సీఎం కిరణ్‌ నడుచుకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే ఆయనను నియంత్రించాలని కోరారు. విబజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల్లో నెలకొన్న ఆందళనలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం, కాంగ్రెస్‌ పార్టీపై ఉందన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.. కానీ సీఎం కిరణ్‌ మాత్రం సమైక్యాంధ్ర అంటున్నారని.. ఇదే విషయమై తాను ¬ం మంత్రి షిండేను అడిగానన్నారు. ఆ ప్రశ్నకు ఆయన ఏమి మాట్లాడకుండా నవ్వి ఊరుకున్నారని తెలిపారు. దీన్ని బట్టి కిరణ్‌ అధిష్టానం ఆడుతున్న ఆటలో భాగంగానే ఆడుతున్నాడని అర్థమవుతోందన్నారు. ప్రక్రియను ఆలస్యం చేయడం వల్లే సీమాంధ్రలో ఉద్యమం జరుగుతోందని, వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన ప్రైవేట్‌ బస్సు ప్రమాదంలో 45 మంది మృతి చెందడంపై నారాయణ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రైవేట్‌ ఆపరేటర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని విమర్శించారు. ప్రైవేటు బస్సులను చూస్తూ వదిలేయడం వల్లే ఆర్టీసీ ఆదాయిని గండిపడుతోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *