Monday, 2 November 2026

మంత్రుల బృందం విధివిధానాలపై అఖిలపక్షం


కేంద్ర హోం మంత్రి షిండే
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 30 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఏర్పాటు చేసిన మంత్రుల బృందం విధివిధానాలపై రాష్ట్రంలోని అన్ని పార్టీలతో అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే తెలిపారు. నవంబర్‌ మొదటి వారంలోనే ఇది ఉంటుందన్నారు. దీనికి ముందు అన్ని పార్టీలను సంప్రదిస్తామనిచెప్పారు. ఈ సమావేశానికి 8 రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తారు. జీవోఎం విధివిధానాలపై అభిప్రాయాలను వ్యక్తం చేసిన తర్వాత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు షిండే చెప్పారు. నవంబర్‌ 7వ తేదీలోపల గానీ తర్వాత గానీ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు- చేయనున్నట్లు ఆయన తెలిపారు. విధివిధానాలపై అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ ¬ం శాఖ 8 రాజకీయ పార్టీలకు లేఖలు రాస్తారు. ఐదో తేదీలోగా రాజకీయ పార్టీలు జివోఎం విధివిధానాలపై రాజకీయ పార్టీలు అభిప్రాయాలు చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణపై బుధవారంనాడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ షిండేను కలసి అఖిలపక్షం పెట్టాలని  చేసిన సూచనను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలావుంటే  ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పి. చిదంబరం, సుశీల్‌ కుమార్‌ షిండే, ఎకె ఆంటోనీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ పాల్గొన్నారు. కోర్‌ కమిటీ సమావేశానికి ముందు సుశీల్‌ కుమార్‌ షిండే బుధవారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ ఆంధప్రదేశ్‌ కార్యదర్శి కె. నారాయణ బుధవారం షిండేను కలిసి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఎఎస్‌, ఐపియస్‌ అధికారుల విభజనకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కేంద్రానికి అందించింది. ఏ ప్రాంతానికి ఎంత మంది వెళ్లాలనే వివరాలను ఈ నివేదికలో పొందుపరిచారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి బుదవారం కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి వి. నారాయణస్వామిని కలిసి ఆ నివేదికను అందించారు. ఇదిలావుంటే, విజయ కుమార్‌ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌ బుధవారం హైదరాబాదులో సమావేశమైంది. ఈ సమావేశంలో డిజిపి ప్రసాదరావు పాల్గొన్నారు. విభజన నేపథ్యంలో శాంతిభద్రతలపై టాస్క్‌ఫోర్స్‌ అధ్యయనం చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తంవిూద దీనిపై ఇప్పుడే మరోమారు నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *