
ధిక్కార నేతలపై బొత్సా ఫైర్
హైదరాబాద్, అక్టోబర్ 31 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటుకు సం బంధించి వివిధ అంశాలపై చర్చించేం దుకు కేంద్ర ప్రభు త్వం అఖిలపక్ష సమా వేశం ఏర్పాటు చేయ డాన్ని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్వాగతించారు. అఖిలపక్ష సమావేశం వల్ల సామరస్య పూర్వక వాతావరణం ఏర్పాడుతుందని భావిస్తున్నానన్నారు. సమస్యల పరిష్కారం కోసమే కేంద్రం ఈ సమావేశం ఏర్పాటు చేసిందని అఖిలపక్షంపై ప్రజలను మభ్యపెట్టేందుకు రాజకీయ పార్టీలు యత్నించవద్దని కోరారు. అఖిలపక్ష భేటీకి సంబంధించి అనవసరమైన ఆశలు, అనుమానాలు తగవని తెలిపారు. ఈ అవకాశాన్ని అన్ని పార్టీలు వినియోగించుకోవాలని కోరారు. గురువారం బొత్స మీడియాతో మాట్లాడారు. విభజన అంశంపై కేంద్రం నుంచి విధి విధానాలు అందిన తర్వాత స్పందిస్తామని చెప్పారు. కేంద్రం నుంచి మరింత స్పష్టత వచ్చాక పార్టీ తరఫున అఖిలపక్షానికి వెళ్లేది ఎవరనేది ఖరారవుతుందని తెలిపారు. రాజకీయ పార్టీలు ప్రజలను మభ్యపెట్టకుండా.. ఏ విధంగా సమస్యలను పరిష్కరించాలో సూచించాలని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర విభజనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాను గతంలో కేంద్రాన్ని కోరానని చెప్పారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న అఖిలపక్షం ఎవరు ఏమిటో తెలియాలనే ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. గతంలో సీపీఎం మినహా అన్ని పార్టీలు విభజనకు అంగీకారం తెలిపాయన్నారు. తమ పార్టీని దెబ్బ తీసేందుకు సమావేశం ఏర్పాటు చేశారన్ని టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్రాన్ని విభజించాలని తెలుగుదేశం గతంలోనే జరిగిన అన్ని సమావేశాల్లో చెప్పిందని గుర్తు చేశారు. రాష్టాన్న్రి విబజించే అధికారం కేంద్రానికి వైఎస్సార్సీపీ చెప్పిందన్నారు. ఇప్పటికైనా రాజకీయాలు చేయడం మాని ఆయా పార్టీలు తాజాగా ఏర్పాటు చేసిన సమావేశంలో సమస్య పరిష్కారానికి తోడ్పడడాలని కోరారు. అపోహలను, అనుమానాలను పక్కకు పెట్టి పార్టీలు వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. అధికారం కోసం రాజకీయం చేయడం మానేసి సామరస్యపూర్వక వాతావరణంలో సమ్యను పరిష్కరించడానికి యత్నించాలని కోరారు. అఖిలపక్ష సమావేశం వల్ల సామరస్య పూర్వక వాతావరణం ఏర్పాడుతుందని భావిస్తున్నానన్నారు. ఈ భేటీ వల్ల మంచి జరుగుతుందని సీమాంధ్ర నాయకుడిగా, పీసీసీ అధ్యక్షుడిగా అనుకుంటున్నట్లు తెలిపారు. అఖిలపక్షం ఏర్పాటు చేసినందుకు బొత్స ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
వెళ్లే వారు వెళ్లిపోవచ్చు..
పార్టీ హైకమాండ్‌పై విమర్శలు గుప్పిస్తున్న నేతలపై బొత్స అసహనం వ్యక్తం చేశారు. ఇష్టమైతే పార్టీలో ఉండొచ్చు.. లేకపోతే వెళ్లిపోవచ్చని, కానీ విమర్శలు చేయడం సరికాదన్నారు. పార్టీని నష్టపరిచే, కించపరిచే మాటలు మానుకోవాలని, లేదంటే వారి ఇష్ట ప్రకారం నడుచుకోవాలని పరోక్షంగా పార్టీని వీడివెళ్లాలని సూచించారు. పార్టీలో ఉంటూ పార్టీపై విమర్శలు చేయొద్దని బొత్స సూచించారు. జేసీ దివాకర్‌రెడ్డి వంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్‌ను నష్టపరిచే వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. కాంగ్రెస్‌ను వీడేవారు వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించారు. అయితే, నాయకత్వంపై విమర్శలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటారా? అని విలేకరులు ప్రశ్నించగా పార్టీని వీడి వెళ్లిపోవాలనుకున్న వారిపై చర్యలేం తీసుకుంటామని ఎదురు ప్రశ్నించారు. అవకాశాల కోసం పార్టీ నాయకులు కొందరు పక్క చూపులు చూస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెడతారని వస్తున్న వార్తలపై ప్రశ్నించగా ఆయన ఖండించారు. కిరణ్ పార్టీ పెట్టబోరన్నారు. విభజనపై వైఎస్సార్సీపీ పూటకో మాట మాట్లాడుతోందని మండిపడ్డారు. తొలుత తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నామని, ఆర్టికల్ 3 ప్రకారం విభజన చేయాలన్నారని గుర్తు చేసిన బొత్స ఆ తర్వాత సమన్యాయం చేయాలని కొత్త పల్లవి అందుకున్నారని ఎద్దేవా చేశారు. సమన్యాయం చేయాలని జైల్లో జగన్, గుంటూరులో విజయమ్మ దీక్ష చేశారని తెలిపారు. మళ్లీ ఇప్పుడేమో రాష్టాన్న్రి సమైక్యంగా ఉంచాలని మాట మార్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తానంటున్న చంద్రబాబు ముందు రాష్ట్రం సమైక్యంగా ఉండాలా? వద్దా? అన్నది చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం తండ్రి పాత్ర పోషించాలన్న వైఎస్ జగన్‌కు ఆ రోజు సమైక్యం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఇరు ప్రాంతాల్లోని సెంటిమెంట్‌ను అడ్డుం పెట్టుకొని రాజకీయ పార్టీలు వలసలను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు.




