Tuesday, 3 November 2026

మూడు రోజుల్లో నివేదిక


ఇరు రాష్ట్రాల్లో పటిష్టమైన పోలీస్‌
అన్ని శాఖలను సంప్రదించి సమగ్ర సమాచారం సేకరించాం
టాస్క్‌ ఫోర్స్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌ 31 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, సీమాంధ్రగా విభజిస్తున్న తరుణంలో ఇరు ప్రాంతాల్లో శాంతి భద్రతలు అదుపులో ఉంచడమే ప్రధాన లక్ష్యంగా తాము వివరాలు సేకరించామని టాస్క్‌ఫోర్స్‌ కమిటి చైర్మన్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. మూడోరోజు ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. సుమారు గంటన్నరకుపైగా సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. శాంతి బధ్రతలను పరిరక్షిం చడంలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ఇప్పటి వరకు సరిహద్దు భద్రత, హైదరాబాద్‌, నక్సలిజం, తీవ్రవాదం అంశాలపై పూర్తిగా వివరాలు సేకరిస్తున్నామ న్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాలకు చెందిన అధికారులు, బృందాలతో చర్చలు జరుపుతున్నట్లు  రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి కేంద్రప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. ఇరు ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మొత్తానికి ఇరు ప్రాంతాల్లో శాంతి భద్రతలను పరిరక్షించడమే ప్రధాన ధ్యేయమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *