Tuesday, 3 November 2026

నెరవేరనున్న చిరకాల స్వప్నం


ఉద్యోగులకు హెల్త్‌కార్డులు
హైదరాబాద్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి) :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరింది. ఉద్యోగులకు హెల్త్‌కార్డులు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. 174, 175, 176 జీవోలు జారీ చేసింది. దీపావళి కానుకగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ఆరోగ్య కార్డుల సదుపాయం అందనుంది. ఉద్యోగులు కనిష్టంగా రూ.90, గరిష్టంగా రూ.120 నెల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *