
ద్రవోల్బణం తగ్గుతోంది
విత్తమంత్రి ఆశాభావం
న్యూఢిల్లీ, నవంబర్ 1 (జనంసాక్షి) :
ఈ యేడాది మంచి వర్షాలు కురిసాయని, దాని ప్రభావంతో ఐదేళ్ల గరిష్ట స్థాయిలో బీఎస్‌ఈ సెన్సెక్స్ నమోదైందని ఆర్థిక మంత్రి పి. చిదంబరం తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమృద్ధిగా వర్షాలు కురవడంతో ఆహార ఉత్పత్తుల దిగుబడి పెరుగుతుందని, ఎగుమతులు పెరిగే అవకాశాలున్నాయని దాని ఫలితం ఆహార ద్రవ్యోల్బణంపై చూపుతుందని తెలిపారు. వర్షాలు ఎక్కువగా కురిసిన నేపథ్యంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని, దీంతో నిత్యావసరాల ధరలు అదుపులోకి వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరెంట్ ఖాతా లోటు 60 బిలియన్ డాలర్లకు తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ వర్షాలతోనే ఆర్థిక అభివృద్ధి సాధ్యపడిందని తెలిపారు. ఆహార ద్రవ్యోల్బణం నియంత్రణకు ఆర్‌బీఐ నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దీపావళి సందర్భంగా సెన్సెక్స్ ఐదేళ్ల గరిష్ట స్థాయిలో నమోదవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజిలో శుక్రవారం సెన్సెక్స్ 21,293.88 పాయింట్ల వద్ద నమోదైంది. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో దేశం ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమిస్తామని అన్నారు.
మంచి వర్షాలు కురిసాయి




