Tuesday, 3 November 2026

భారత సరిహద్దులో ఘనంగా దివాళి సంబరాలు


న్యూఢిల్లీ/శ్రీనగర్‌,
నవంబర్‌ 3 (జనంసాక్షి) :
నిత్యం కవ్వింపులు.. కాల్పులతో దద్దరిల్లే భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దులో ఆదివారం పండుగ వాతావరణం నెలకొంది. దీపావళి పర్వదినం సందర్భంగా ఇరు దేశాల సరిహద్దులో సైనికులతు ఘనంగా దీపావళి పండుగను జరుపుకున్నారు. బోర్డన్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో భారత్‌-పాక్‌, భారత్‌-బంగాదేశ్‌ సరిహద్దులో ఈ వేడుకలు నిర్వహించారు. భారత్‌-పాక్‌ సైనికులు పరస్పరం అభినందనలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
జమ్మూలోని వాఘా సరిహద్దు వద్ద బీఎస్‌ఎఫ్‌ జవాన్లు పాక్‌ సైనికులు స్వీట్‌బాక్స్‌లు పంపిణీ చేశారు. అనంతరం సైనికులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఎల్‌వోసీ వెంట క్యాండిళ్లు వెలిగించి బాణాసంచా పేల్చారు. పశ్చిమబెంగాల్‌లోని దినాజ్‌పూర్‌ జిల్లాలో గల భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులో జవాన్లు మతాబులు పేల్చారు. జమ్మూలోని రణ్‌బీర్‌పూరలో గల భారత్‌-పాక్‌ సరిహద్దులో స్థానికులతో కలిసి జవాన్లు సంబరాలు జరుపుకున్నారు. అగర్తాలోని భారత్‌-బంగ్లా సరిహద్దులో, పశ్చిమబెంగాల్‌లోని దినాజ్‌పురాలో, అగర్తాలోని లంకమూరాలో గల బంగ్లా సరిహద్దులో బీఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *