Tuesday, 3 November 2026

ప్రత్యేక పరిస్థితుల్లోనే మరణశిక్ష విధించాలి


అందుకు బలమైన కారణముండాలి : సుప్రీం
న్యూఢిల్లీ, నవంబర్‌ 5 (జనంసాక్షి) :
కోర్టులు మరణశిక్ష విధించినప్పుడు ప్రత్యేక కారణాలు చూపిం చాలని సుప్రీంకోర్టు స్ప ష్టం చేసింది. చేసిన నేరాన్ని, నేరస్థుడి నైజా న్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని, జీవించే అధికారాన్ని నిరాకరించేంత తీవ్రత  ఆ రెండింటిలో ఉండాలని ధర్మాసనం చెప్పింది. జస్టిస్‌ ఏ.కె. పట్నాయక్‌, జస్టిస్‌ జ్ఞాన్‌సుధామిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు తెలియజేసింది. రాజస్థాన్‌కు చెందిన ఓ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం తీర్పు వెలువరించింది. కింది కోర్టు 2003నాటి అత్యాచారం, హత్య కేసులో ఇద్దరు నిందితులకు బలమైన కారణాలు చెప్పకుండా మరణశిక్ష విధించిందని కోర్టు అభిప్రాయపడింది. నిందితులు ఇద్దరూ కలిసి చున్నీతో యువతి మెడకు ఉరివేసి చంపడం క్రూరమైన నేరమే అయినప్పటికీ వారిద్దరూ చావుకు అర్హులనే విధంగా వారి నైజానికి సంబంధించిన ఆధారాలను తీర్పులో పేర్కొనలేదని తెలిపింది. ఇది అత్యంత అరుదైన సందర్భం కాదని తేల్చిచెప్పింది. అదే సమయంలో సాక్షి వాంగ్మూలం విరమించుకున్నందున నిందితులు ఇద్దరరూ నిర్ధోశులేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పునూ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వారిద్దరికీ పదేళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *