Tuesday, 3 November 2026

నిస్వార్థ సేవకు అంకితంకండి


దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడండి
ఐపీఎస్‌ల పాస్‌ ఔట్‌ పరేడ్‌లో రాష్ట్రపతి పిలుపు
హైదరాబాద్‌, నవంబర్‌ 5(జనంసాక్షి) :
శిక్షణ పూర్తిచేసుకున్న ఐపీఎస్‌లు నిస్వార్థ సేవకు అంకితం కావాలని, దేశ సమగ్రత, సమైక్యతను కాపాడేందుకు నిరంతరం కృషి చేయాలని భారత రాష్ట్రపతి ప్రణభ్‌ముఖర్జీ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లాబాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ శిక్షణ అకాడమీలో నూతన ఐపీఎస్‌ల 55వ బ్యాచ్‌ శిక్షణ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్రతి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో అంతర్గత భధ్రతను పెంచడం ప్రధాన కర్తవ్యంగా వ్యవహరించాలన్నారు. దేశం విూపై ఎంతో ఆశలు పెట్టుకుందని, వాటిని వమ్ము చేయకూడదన్నారు. మతసామరస్యం కాపాడడంలో క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. ఐపీఎస్‌లంటే కేవలం శాంతి భద్రతలను కాపాడే వారే కాదను గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో జరుగుతున్న విద్రోహక చర్యలను తుంచి వేసేందుకు ప్రయత్నిం చాలన్నారు. సామాన్యుడికి న్యాయం జరిగే వరకు కూడా ఐపీఎస్‌లు నిద్రపోవద్దన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలన్నారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచార ఘటనలనుంచి రక్షణ కల్పించేందుకు గాను కఠినమైన చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఐపీఎస్‌లు వృత్తి నిబద్దతతో వ్యవహరించాలన్నారు. అంకిత భావంతో శిక్షణ పూర్తి చేసుకున్న యువ ఐపిఎస్‌ అధికారులను తాను సగర్వంగా అభినందిస్తున్నానన్నారు. భారత్‌ నిరంతరం ఉగ్రవాదుల దాడులకు గురవుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే భారత్‌ ఉగ్రవాదులను తిప్పికొట్టడంలో ముందుంటూనే ఉందన్నారు. జస్టిస్‌ వర్మ చేసిన సూచనలు పోలీస్‌శాఖకు ఎంతో ప్రాణాలను కాపాడేలా ఉందన్నారు.  పోలీస్‌ అనేది ప్రో ఆక్టివ్‌ ఏజెన్సీగా మారాల్సిన అవసరం ఉందన్నారు.  హైదరాబాద్‌లోని సర్దార్‌వల్లాబాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ శిక్షణ కేంద్రంలో గడిచిన కొంత కాలంగా శిక్షణ పొందుతున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 148మంది ఐపిఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కార్యక్రమం విజయంతంగా ముగిసింది. ఈపరేడ్‌ను రాష్ట్రపతి ప్రణభ్‌ ముఖర్జీ స్వీకరించారు. నూతనంగా ఐపిఎస్‌లుగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న వారు నిర్వహించిన పరేడ్‌ పలువురిని ఆకట్టుకుంది. వారినుంచి గౌరవవందనాన్ని రాష్ట్రపతి స్వీకరించారు. మొత్తం 148మంది శిక్షణను పూర్తిచేసుకోగా ఇందులో 22మంది మహిళా ఐపిఎస్‌లున్నారు. ఆంధ్రా క్యాడర్‌కు చెందిన వారు 8మంది ఉన్నారు. ముగ్గురు మాల్దీవ్‌లకు చెందిన వారు అయిదుగురు నేపాల్‌ సర్వీస్‌కు చెందిన ఐపిఎస్‌లుండడం విశేషం. పరేడ్‌ కమాండెంట్‌గా ఆంధ్రా క్యాడర్‌కు చెందిన శాలిని అగ్ని¬త్రి వ్యవహరించారు. శిక్షణ పొందిన వారిలో ఆంధ్రప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడుకు చెందిన ఐపిఎస్‌ అధికారులున్నారు. శిక్షణ కేంద్రం ఇంచార్జ్‌ సుభాష్‌ గోస్వామి నూతనంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఐపిఎస్‌ అధికారులతో ప్రమాణం చేయించారు. శిక్షణపూర్తి చేసుకున్నవారిలో తమిళనాడుకు చెందిన అశ్విక దళం కూడా ఉంది. ఈసందర్భంగా వివిధ మెడళ్లను, మెమెంటోలను శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర పతి అందించారు. ఆల్‌ రౌండ్‌ ప్రతిభ కనబరిచిన ఆంద్రా క్యాడర్‌ ఐపిఎస్‌కు ఎంపికైన హిమాచల్‌ ప్ర దేశ్‌కు చెందిన శాలిని అగ్ని¬త్రికి మెమెంటోలను రాష్ట్రపతి అందించారు. వివిధ రకాలట్రోపీలను అరున్‌ బండార్‌ రాయ్‌, మణిపూర్‌ క్యాడర్‌కు చెందిన హర్షవర్దన్‌, గుజరాత్‌కు చెందిన తరుణ్‌కుమార్‌, రోహిత్‌విూనా, నేపాల్‌కు చెందిన కుమారి శర్మిలా గోల్‌, తమిళనాడుకు చెందిన దేశ్‌ముఖ్‌ సంజయ్‌, పంజాబ్‌కు చెందిన భవనంద మిశ్రా, ఏపి క్యాడర్‌కుచెందిన భాస్కర్‌లకు మెమెంటోలను బహుకరించారు. అలాగే రాష్ట్రపతి మెడల్‌కు ఎంపికైన బిఎస్‌ఎఫ్‌ కమాండర్‌ సరభ్‌జిత్‌ సింగ్‌కు, అలాగే ఎస్‌ఐ శివారెడ్డికి, హెడ్‌ కానిస్టేబుళ్లు ఎన్‌. రమణారెడ్డి, బి. గోపాల్‌లకు రాష్ట్రపతి మెడల్స్‌ను బహుకరించారు. ఈసందర్భంగా నూతన ఐపిఎస్‌ అధికారులు నిర్వహించిన పరేడ్‌ పలువురిని ఆకట్టుకుంది.

ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయిన రాష్ట్రపతి

రాష్ట్రంలో రెండు రోజులపాటు పర్యటనను ముగించుకున్న రాష్ట్రపతి ప్రణభ్‌ముఖర్జీ మంగళవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో బేగంపేట విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం జాతీయ పోలీస్‌ అకాడవిూలో ఐపిఎస్‌ 65వ బ్యాచ్‌ అధికారుల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొన్న ఆయననేరుగా బేగంపేట విమానాశ్రయానికి భారీ బందోబస్తు మధ్య చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌, మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, ఎంపిలు విహెచ్‌, వివేక్‌, శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి తోపాటు అధికారులు వీడ్కోలు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *