
హైదరాబాద్, నవంబర్ 6 (జనంసాక్షి)
రాష్ట్ర విభజన అనివా ర్యమని మంత్రి సి.రా మచంద్రయ్య స్పష్టం చేశారు. బుధవారం సచివాలయం వద్ద వి లేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన అనంతరం అవస రమైన నిర్ధిష్ట అంశా లను కోరుకోవాల్సిన సమయం సీమాంధ్ర ప్రజలకు ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటిదాకా రాష్ట్ర విభజన జరగదనే భ్రమలో ఉన్న మేం చాలా కోల్పోయాం. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన సమయం వచ్చింది.”అని మంత్రి తెలిపారు. విభజన అనంతరం రాయలసీమ ప్రయోజనాల పరిరక్షణపై తాను మంగళవారం జీవోఎంకు ఒక నివేదిక సమర్పించినట్లు రామచంద్రయ్య చెప్పారు. సాగు జలాలపై రాయలసీమ రాజ్యాంగబద్ధమైన రక్షణ అవసరం. రాయలసీమ 300 టీఎంసీల జలాలు కావాలి అని ఆయన డిమాండ్ చేశారు. కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన 20 వేల ఎకరాల్లో ఒక ఉక్కు కర్మాగారం, అనంతపురం జిల్లాలో ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మంత్రి కోరారు. విభజన అనివార్యం కావడంతో తమ భవిష్యత్ అవసరాలపై సీమాంధ్ర ప్రజల్లో భయాందోళనలు చోటు చేసుకున్నాయని ఆయన చెప్పారు. రాయల – తెలంగాణ ప్రతిపాదనను తాను వ్యతిరేకిస్తానని మంత్రి తెలిపారు. వెనుకబడిపోయిన రాయలసీమ ప్రాంతానికి విభజన అనంతరం రక్షణ అవసరమని శ్రీకృష్ణ కమిటీ సైతం వేలెత్తి చూపిందని రామచంద్రయ్య చెప్పారు.
జ్ఞానోదయం.. విభజన అనివార్యం మంత్రి రామచంద్రయ్య




