
తెలంగాణ వచ్చే వరకూ కొత్త ఉద్యోగాలు వద్దు
కోదండరామ్
ఖమ్మం, నవంబర్ 6 (జనంసాక్షి) :
నిజాం కాలం నుంచి హైదరాబాద్ రాజ్యంలో అంతర్భాగ ంగా ఉన్న భద్రాచలాన్ని పోలవరం నిర్మించి ముంచేందుకే సీమాంధ్రులు రగడ చేస్తున్నారని టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ తెలిపారు. బుధవారం భద్రాచలంలో జే ఏసీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే’ అనే సదస్సులో ఆయన పా ల్గొని మాట్లాడారు. ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భా గమేనని స్పష్టం చేశారు. తెలంగాణకు హైదరాబాద్ గుం డెకాయ అయితే భద్రాచలం ఆత్మలాంటిదన్నారు. భద్రా చలంతో కూడి పది జిల్లాల తెలంగాణ ఏర్పడుతదని ఆ యన విశ్వాసం వ్యక్తం చేశారు. కొందరు కుహాన ఆంధ్రా మేధావులు భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాలనడం అవివేకమని మండిపడ్డారు. భద్రాచలం అప్పుడూ ఇప్పడు తెలంగాణదేనన్నారు. ఈ విషయంలో తాము రాజీపడ బోమన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే పదోన్నతుల ప్రక్రియ కూడా చేపట్ట వద్దని కోరారు. సీమాంధ్ర పాలకుల పక్షపాత వైఖరి కారణంగా యాభై ఏళ్లుగా తెలంగాణ ప్రాంతం అన్యాయానికి గురవుతూనే ఉందన్నారు. తెలంగాణ ప్రాంతంలో లభించే బొగ్గును స్థానిక విద్యుత్ ప్రాజెక్టులకే కేటాయించాలని, మిగులు బొగ్గును ఆంధ్ర ప్రాజెక్టులకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ వాటాగా అన్ని ప్రభుత్వ శాఖలో 42 శాతం ఈ ప్రాంత ఉద్యోగులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఉద్యోగ టీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు రంగరాజు, పిట్టల రవీందర్, ఎం. నెహ్రూ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలాన్ని ముంచేందుకే రగడ




