
ఎల్‌అండ్‌టీ సీఈవో వీడీ గాడ్గిల్
హైదరాబాద్, నవంబర్ 7 (జనంసాక్షి) :
మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణంలో ఎవరికీ ముడుపులివ్వలేదని ఎల్‌అండ్‌టీ సీఈవో వీడీ గాడ్గిల్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మెట్రో ప్రాజెక్టు ఎండి ఎన్‌విఎస్ రెడ్డితో కలిసి మీడి యాతో మాట్లాడారు. మెట్రో ప్రాజెక్టు రైలు ని ర్మాణంలో అవినీతి జరుగుతోందని టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. కొందరు కావాలనే ఈ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మెట్రో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించిన నాటినుంచి దీన్ని అడ్డుకోవాలని చాలా మంతి ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో ఈ ప్రాజెక్టుపై చేసిన ఆరోపణలన్నీ ఉత్తుత్తివేనని తేలిపోయానని ఆయన అన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కడా ప్రాజెక్టు పనులు జరగడం లేదని ఆయన తెలిపారు. మెట్రో రైలు నిర్మాణం, టెండర్లు, భూ పరిహార చెల్లింపులు నిబంధనల మేరకే జరిగాయని ఆయన అన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని చేస్తున్న వారు ఎలాంటి విచారణనైనా నిర్వహించుకోవచ్చునని ఆయన సవాల్ విసిరారు. ఈ ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు కూడా సిద్ధమని ఆయన అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందని ఆయన అన్నారు. ముందుగా ప్రణాళిక వేసుకున్న మాదిరిగానే మెట్రో రైలు ప్రాజెక్టు పనులు త్వరితగతిన జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ముందుగా ప్రకటించిన మాదిరిగానే 2014 డిసెంబర్ నాటికి ఈ మెట్రోరైలు నిర్మాణం పనులను పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. 2014, మార్చి 21న నాగోలు, మెట్టుగూడ ప్రాంతాల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 2015 ఉగాది నుంచి మెట్రో రైలు జంట నగరాల్లో తిరుగుతాయని ఆయన స్పష్టంచేశారు. మెట్రో రైలు పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిని తాము పట్టించుకోమని, తాము తలపెట్టిన పనులను సక్రమంగా పూర్తిచేస్తామని అన్నారు.
మెట్రో రైలు పనులకు ముడుపులివ్వలేదు




