
నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ బంధం బలమైనది : రాహుల్
జమ్మూ, నవంబర్ 7 (జనంసాక్షి)
గ్రామ పంచాయతీలను పటిష్టం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఉపా ధ్యక్షుడు రాహు ల్‌గాంధీ అన్నా రు. సర్పం చుల హక్కుల కోసం తమ పార్టీ పోరాడుతోందని ఆ యన పేర్కొన్నారు. జమ్మూలో జరిగిన కార్యక్రమంలో ఆ యన మాట్లాడుతూ ప్రజల భాగస్వా మ్యంతో పంచాయతీలు బలోపేత మవుతాయని ఆయన పేర్కొ న్నారు. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్‌తో కలిసి రాహుల్ సభలో పాల్గొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్‌తో కాంగ్రెస్ పార్టీకున్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి ఎన్‌సీతో కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తుందన్నారు. ఈరెండు పార్టీలు జమ్మూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. సీమాంతర ఉగ్రవాదం, అంతర్గత భద్రతపై తమ పార్టీ రాజీపడదన్నారు.
పంచాయతీలను పటిష్టం చేస్తాం




