Tuesday, 3 November 2026

తెలంగాణపై అసెంబ్లీలో ఓటింగ్‌ ఉండదు


అభిప్రాయ సేకరణకే బిల్లు : బొత్స
హైదరాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై అసెంబ్లీలో ఓటింగ్‌ ఉండబోదని, కేవలం అభిప్రాయ సేకరణ కోసం మాత్రమే బిల్లు శాసనసభ ముందుకు వస్తుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ కార్యకర్తగా పార్టీ వర్కింగ్‌ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అయితే అసెంబ్లీ ముందుకు వచ్చినప్పుడు తెలంగాణ ఏర్పాటును సీమాంధ్ర ప్రజల అభిప్రాయాల మేరకు వ్యతిరేకిస్తానని చెప్పాను. రాష్ట్ర విభజనపై సభలో రాజకీయ పక్షాలు అభిప్రాయాలను మాత్రమే తీసుకుంటారని తెలిపారు. తెలంగాణపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోతుందని కొందరు మంత్రులు చేసిన వాదనతో బొత్స ఏకీభవించలేదు. విభజనపై తీసుకున్న నిర్ణయం సీమాంధ్రలో పార్టీ విజయావకాశాలను కొంతవరకు దెబ్బతీస్తుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *