Tuesday, 3 November 2026

ఫిలిప్పీన్స్‌ కకావికలం


పది వేల మందికిపైగా మృతి
శతాబ్దిలో ఇదే పెద్ద తుపాను
మనీలా, నవంబర్‌ 10 (జనంసాక్షి) :
హయాన్‌ తుపాను దాటికి ఫిలిప్పీన్స్‌ కకావికలమైంది. ఈ శతాబ్దంలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఇక్కడ పెనునష్టం సంభవించింది. హయాన్‌ తుపాను పది వేల మందికిపైగా ప్రజ లను పొట్టనబెట్టుకుంది. మృతుల సంఖ్యపై స్పష్టత రాకపోయినా ఇంకా ఎక్కువ మందే చని పోయి ఉంటారని సమాచారం. వేలాది ఇళ్లు కూలిపోయాయి. చెట్లు విరిగిపడి ఇళ్లు, వాహ నాలు భారీగా ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు రెస్‌క్రాస్‌ ప్రకటించింది. కానీ మృతుల సంఖ్యపై ఇ ప్పుడే స్పష్టత వచ్చే అవకాశం లేదు. సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో బాహ్య ప్ర పంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. బాధితులకు సత్వరం నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఫిలిప్పీన్‌ ప్రధాని అధికారులను ఆదేశించారు. తాము పుట్టినప్పటి నుంచి ఇంతటి బీభత్సాన్ని చూడలేదని స్థానికులు చెప్తున్నారు. హయాన్‌ తుపాను ఆదివారం మధ్యాహ్నం వియత్నాం వద్ద తీరదాటిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలో వియత్నాం ప్రభుత్వం అప్రమత్తమైంది. సుమారు రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *