
పాల్గొనున్న మిగిలిన పార్టీలు
హైదరాబాద్, నవంబర్ 10 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో కేం ద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన మం త్రుల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ తెలిపింది. టీడీపీ మినహా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఆహ్వానం అందుకున్న మిగతా ఏడు పార్టీలు అఖిలపక్షానికి హాజరుకానున్నాయి. ఈనెల 12న ఢిల్లీలో కేంద్ర మంత్రుల బృందం ఎదుట రాష్ట్రానికి చెందిన గుర్తింపుపొందిన పార్టీలు విడివిడిగా భేటీ అయి ఆంధ్రప్రదేశ్ విభజనపై తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తాయి. జీవోఎం ఎదుట భేటీ అయ్యే ప్రతినిధుల పేర్లను పార్టీలు ఖరారు చేశాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి వట్టి వసంతకుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంవీ మైసూరారెడ్డి, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ, సీపీఎం నుంచి బీవీ రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, సీపీఐ నుంచి నారాయణ, జెల్లి విల్సన్ జీవోఎం ఎదుట హాజరుకానున్నారు. అయితే బీజేపీ నుంచి ప్రతినిధిగా ఒక్కరు హాజరవుతారా? లేక ఇద్దర్ని పంపుతారా? అనే విషయంపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అఖిలపక్షానికి టీడీపీ దూరం




