Tuesday, 3 November 2026

మొహం ఏడబెట్టుకొని తెలంగాణకొస్తవ్‌


కిరణ్‌పై హరీశ్‌ ఫైర్‌
కరీంనగర్‌, నవంబర్‌ 10 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజల ఆకాం క్షలను అణచాలని చూస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమా ర్‌రెడ్డి తెలంగాణ ప్రాంతానికి ఏడ మొహం పెట్టుకుని వస్తా రని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీ శ్‌రావు ప్రశ్నించారు. సమై క్యాంధ్రే తన లక్ష్యమని చెప్పుకుంటూ సీఎం ఎలా రచ్చబండ కార్యక్రమానికి వస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రచ్యబండ పేరుతో తెలంగాణలో పర్యటించే ప్రయత్నం చేస్తున్న సీఎంకు ఇక్కడ అడుగుపెట్టే నైతిక హక్కులేదన్నారు. సీమాంధ్రలో ఉద్యమం పేరుతో రచ్చబండను మూడు నెలల పాటు వాయిదా వేసిన సీఎం తెలంగాణలో పర్యటించాలనే దురుద్దేశంతోనే ఇప్పుడు రచ్చబండ అంటున్నాడని పేర్కొన్నారు. ఏడాదిన్నర క్రితం నిర్వహించిన రచ్చబండ అర్జీలు ఏమయ్యాయి, ఎన్ని నిధులు కేటాయించారు, ఏం అభివృద్ధి చేశారో వెల్లడించాలన్నారు. రైతులు నిరాశ, నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీసీఐ కొనుగోళ్లే చేపట్టడం లేదన్నారు. తెలంగాణ రైతుల బాధలు పట్టించుకోని కిరణ్‌ ఇప్పుడు రచ్చబండ పేరుతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనన్న కిరణ్‌ చిత్తూరు జిల్లాకు రూ.5,800 కోట్లు కేటాయించారని, చిత్తూరు జిల్లాలో రెండో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ పెట్టుకున్నాడని తెలిపారు. తెలంగాణకు ఇంతలా మోసం చేసి ఇప్పుడు ఇక్కడి వస్తే ప్రజలు చూస్తూ ఊరుకోబోరన్నారు. సమైక్యవాదులను తెలంగాణలో తిరగనివ్వమన్న మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు ఆ మాటకు కట్టుబడాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *