Tuesday, 3 November 2026

హైదరాబాద్‌పై రాజీపడితే తెలంగాణ ఎందుకు?


తెరాస సెక్రటరీ జనరల్‌ కేకే
హైదరాబాద్‌, నవంబర్‌ 10 (జనంసాక్షి) :
హైదరాబాద్‌పై రాజీ పడితే తెలంగాణ ప్రత్యే క రాష్ట్రం ఏర్పడి ఏం ప్రయోజనమని తెలం గాణ రాష్ట్ర సమితి జాతీయ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను కించపరిస్తే టీఆర్‌ఎస్‌ సహి ంచ బోదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన ఆదివారం మధ్యా హ్నం మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ఆంక్షలు పెడితే ఈ ప్రాంత ప్రజలు ఊరుకోరు అని తేల్చి చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణమే తమ లక్ష్యమని చెప్పారు. ఎలాంటి షరతులు లేని తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్‌ పదవులను తృణప్రాయంగా త్యజించారు. తెలంగాణ కోసం అన్నీ సహించాం. జీవోఎంకు తెలంగాణ ప్రజల డిమాండు తెలియజేస్తాం. మా నీళ్లు, కొలువులు మాకివ్వండి. హైదరాబాద్‌పై కేంద్రం అధికారం చెలాయిస్తే ఒప్పుకోబోమని అన్నారు. ఎలాంటి షరతులు లేని తెలంగాణ ఇవ్వండి. మా ఓర్పు, సహనాన్ని బలహీనతగా భావించొద్దు. సీమాంధ్ర కేంద్ర మంత్రుల నివేదిక తప్పుల తడకలు.. మేం కోరుకుం టున్నది సంపూర్ణ తెలంగాణ అని అన్నారు. పదేళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు బాధపడతారన్న దిగ్వీజయ్‌ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

హైదరాబాద్‌లో 7లక్షల మందే : వివేక్‌

హైదరాబాద్‌లో సీమాంధ్రులు కేవలం 7 లక్షల మందే ఉన్నారు.. సీమాంధ్ర కేంద్ర మంత్రుల నివేదిక తప్పుల తడక.. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఉన్న వాస్తవాలను కూడా పక్కదారి పట్టిస్తున్నారని ఎంపీ వివేక్‌ ఆరోపించారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌లో ఒక్క తెలంగాణ ప్రాంత ఉద్యోగి కూడా లేరన్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగుల సంఖ్యపై సీఎం తప్పుడు లెక్కలు చెబుతున్నారు. ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలి అని డిమాండు చేశారు. సీమాంధ్రలో 12 వర్శిటీలున్నాయి.. తెలంగాణ ప్రాంతంలో కేవలం ఏడు యూనివర్శిటీలే ఉన్నాయని అన్నారు. తెలంగాణలో కంటే సీమాంధ్రలోనే మెడికల్‌ సీట్లు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.

హైదరాబాద్‌లో పెట్టుబడులపై..

హైదరాబాద్‌లో పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె.తారకరామారావు డిమాండు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పుట్టకముందే హైదరాబాద్‌ ఒక మహా నగరం అనే విషయాన్ని చరిత్ర చెబుతోంది. రాష్ట్ర ఆర్థికశాఖ ఇచ్చిన నివేదికలు సీమాంధ్ర నేతల కుట్రలను బట్టబయలు చేసిందన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు జీవోఎంకు తప్పుడు నివేదిక ఇచ్చి పైశాచిక ఆనందాన్ని పొందారన్నారు. టి.కాంగ్రెస్‌ నేతలకు చిత్తశుద్ధి ఉంటే అమరుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండు చేశారు. సీమాంధ్ర నేతలు తమ ఆస్తులను పెంచుకోవ డం తప్పా.. హైదరాబాద్‌కు చేసిందేమీ లేదని ఆరోపించారు. హైదరాబాద్‌ ఆదాయంపై సీమాంధ్ర మంత్రులు తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారు. హైదరాబాద్‌లో 50వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వాటి లెక్కలు చెప్పాలని డిమాండు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్నే తప్పుదోవ పట్టిస్తున్నారంటే అంతకంటే నీచమైన పని మరొకటి లేదని వ్యాఖ్యా నించారు. సీమాంధ్ర మంత్రులు అబద్దాల పునాదుల మీద నివేదికలు తయారు చేసి ఇస్తున్నారని ఆరోపించారు. అది వారి విచక్షణకే విడిచిపెడుతున్నామని అన్నారు. టి.కాంగ్రెస్‌ నేతలు కృతజ్ఞతలు చెప్పాల్సింది విద్యార్థులకు, ఉద్యమాన్ని నడిపించిన అన్ని సంఘాలకు అని అన్నారు. సీఎం పదవి కోసం నేనంటే నేనని పోటీ పడుతున్నారు. వరంగల్‌ సభలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటాన్ని కిందపడేశారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *