Tuesday, 3 November 2026

హైదరాబాద్‌పై కిరికిరి చేస్తే మహా ఉద్యమం


టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, నవంబర్‌ 10 (జనంసాక్షి) :
హైదరాబాద్‌పై కిరికిరి పెడితే మహా ఉద్యమం తప్పదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హెచ్చరించారు. తెలంగాణ ప్రాంత ప్రజలు సంపూర్ణ తెలంగాణ కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఆదివారం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలు పెట్టాలని చూసి ఊరుకోబోమని హెచ్చరించారు. సీడబ్ల్యూసీ, కేంద్ర కేబినెట్‌ తీర్మానం మేరకు పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆత్మగౌరవంతో కూడిన స్వయం పరిపాలనే ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు కాలయాపన చేయకుండా ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఇప్పుడు ఏమాత్రం అలసత్వం వహించిన సీమాంధ్రులు తెలంగాణపై కొర్రీలు పెట్టే అవకాశం ఉందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *