
ఘనంగా అబుల్‌కలాం జయంతి
హైదరాబాద్, నవంబర్ 11 (జనంసాక్షి) :
మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం నగరంలో నిర్వహించిన భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌కలాం ఆజాద్ 120వ జయంత్యుత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశాన్ని విద్యాభివృద్ధిలోకి తీసుకెళ్లడంలో అబుల్‌కలాం ఘనణీయమైన పాత్ర పోషించారని కొనియాడారు. అన్నివర్గాలకు చదువును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆయన ప్రయత్నిం చారని అన్నారు. ఆయన స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. దేశంలో పుట్టిన వారంతా చదు వుకొని తీరాలనేది ప్రభుత్వ అభిమతన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనా ర్టీల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోందని తెలిపా రు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా కాం గ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మైనార్టీలను విద్యాపరంగా అభివృద్ధి చేసేందుకు మరిన్ని పథకాలను తీసుకువస్తామని తెలిపారు. కార్య క్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అహ్మదుల్లా పాల్గొన్నారు.
మైనార్టీల సంక్షేమానికి కట్టుబడిఉన్నాం : సీఎం కిరణ్




