Tuesday, 3 November 2026

హైదరాబాద్‌పై ఆంక్షలు వద్దు


రెవెన్యూ జిల్లానే ఉమ్మడి రాజధానిగా పెట్టండి
కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి
హైదరాబాద్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి) :
హైదరాబాద్‌పై ఆంక్ష లువద్దని రవెన్యూ జిలా ్లనే ఉమ్మడి రాజధానిగా పెట్టాలని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి కోరారు. తెలంగాణలోని మిగతా పార్టీలతో పాటుగానే తమ విధానమూ ఒకేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ఏ పార్టీ అయినా ఒకే విధానంతోఉందన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని జానారెడ్డి నివాసంలో జరిగిన టీ కాంగ్రెస్‌ నేతల భేటీలో ఆయన పాల్గొని మాట్లాడారు. భద్రాచలం తెలంగాణలోనే ఉండాలని కోరుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలు విధించినా ఒప్పుకోమని అన్నారు. పదేళ్ల ఉమ్మడి రాజధాని పేరుతో అధికంగా భారం వేస్తే ఒప్పుకోం, నిరసిస్తామని తేల్చిచెప్పారు. చట్టపరమైన వివరాలు లేనప్పుడు ఒక మేరకు స్థాయిని మించి స్పందించలేమని పేర్కొన్నారు. భద్రాచలం తెలంగాణలోనే ఉండాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణలోని మిగతా పార్టీలతో తమ విధానం ఒకేలా ఉంటుందన్నారు. పదేళ్ల ఉమ్మడి రాజధాని పేరుతో అధికంగా భారం వేస్తే ఒప్పుకోమని, నిరసిస్తామని చెప్పారు. చట్టపరమైన వివరాలు లేనప్పుడు ఒక మేరకు స్థాయిని మించి స్పందించలేమని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రుల బృందం(జీవోఎం) ముందుకు మంగళవారం వెళ్లనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు మంత్రి జానారెడ్డి నివాసంలో సోమవారం ఉదయం భేటీ అయ్యారు. తెలంగాణ నేతలు ఆంటోని కమిటీ నివేదికపై తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆంటోనీ కమిటీ పూర్తిగా సీమాంధ్ర నేతల ఒత్తిడి మేరకు రూపొందిందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌తో సహా ఏ విషయాంలోనూ రాజీపడబోమని నేతలు అంటున్నారు. మంగళవారం అఖిలపక్షం ముందు చెప్పాల్సిన అంశాల పైన చర్చిస్తున్నారు. రెవెన్యూ పంపకాలు, శాంతిభద్రతలు, గవర్నర్‌ పాలనకు సంబంధించి రాజీపడబోమని తెలంగాణ నేతలు స్పష్టంచేశారు. జీవోఎం ముందు మరింత బలంగా వాదనలు వినిపిద్దామని వారు నిర్ణయించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారమే రాష్ట్ర విభజన జరగాలని, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందేనని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కోరారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. మరోవైపు భద్రాచలం డివిజన్‌ తెలంగాణలో భాగమేనని దీనిపై రాజీపడేది లేదని సమావేశంలో జైపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం.. భద్రాచలంను సీమాంధ్రలో కలుపడమనేది కొందరి అభిప్రాయం మాత్రమేనని దానిపై అధికారిక వివరాలు లేవని ఆయన స్పష్టం చేశారు.  అఖిలపక్ష  సమావేశంలో తెలంగాణ ప్రాంత వివరాలను అధిష్టానం పెద్దలకు వివరిస్తామని జైపాల్‌ రెడ్డి తెలిపారు.ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను రెవెన్యూ జిల్లా వరకే పరిమితం చేయాలని జైపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాజధాని పదేళ్లే కదా అని హైదరాబాద్‌పై భారం వేస్తామంటే అంగీకరించేది లేదని  అన్నారు. అఖిలపక్షంలో తెలంగాణ ప్రాంత అభిప్రాయాలను డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ వివరిస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆవిర్బవించకముందే తెలంగాణ రాష్ట్రం ఉందని. ఇందులో భద్రాచలం డివిజన్‌ కూడా ఉందని, ఇప్పుడు తమకే కావలని సీమాంధ్రులు కోరడం సరైంది కానేకాదని నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం విషయంలోగాని, హైదరాబాద్‌ విషయంలోకూడా ఏమాత్రం తెలంగాణ ప్రజలు వెనుకంజ వేసే పరిస్థితి లేనే లేదన్నారు. సిడబ్ల్యూసి తీర్మాణం ప్రకారం పదిజిల్లాలు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్నే ఏర్పాటు చేయాలని గుత్తా డిమాండ్‌ చేశారు. నిన్నటి వరకు రెండు రాష్ట్రాలు వద్దన్న సీమాంధ్ర నేతలు నేడు మూడు రాష్ట్రాలుగా విభజించాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. సీమాంధ్రలోని ప్రజలు, నాయకుల అపోహలను తొలగించే పనిని కేంద్రం చేస్తుందన్నారు. ఆంటోని కమిటీ సిఫారసులు మరోసారి తెలంగాణ వారిని భయాందోళనలకు గురిచేస్తున్నాయని గుత్తా ఆవేదన వ్యక్తం చేశారు. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాసేందుకు ఏఒక్క వ్యక్తి కూడా ప్రయ త్నించడని, భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు నడుచు కోవాల్సిందేనన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న వారంతా ఏప్రాంతం వారైనా సరే తమకు సమానమేనన్నారు. హైదరాబాద్‌పై కిరికిరి పెట్టినా, భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలుపాలనుకున్నా కూడా తాము సహించ బోమన్నారు. సోనియాగాంధీ ఆలోచనలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందేనన్నారు. రచ్చబండకు సీఎం వస్తే కూడా అడ్డుకుంటామని గుత్తా హెచ్చరించారు. సమైక్య వాది అయిన విజయమ్మను అడ్డుకున్నట్లుగానే సీఎం నల్గొండ జిల్లాకు వచ్చినా అడ్డుకుని తీరుతామన్నారు. ఇప్పటికే సీమాంధ్రకు దేవుళ్లు ఎక్కువయ్యారని, తెలంగాణ కున్న భద్రాచలంను ఎట్టి పరిస్థితిలోనూ విడిచిపెట్టే ప్రసక్తే లేదని సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, శాసన మండలి సభ్యుడు డి శ్రీనివాస్‌, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సారయ్య, డికె అరుణ, సునితా లక్ష్మా రెడ్డి, ఎంపిలు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *