Tuesday, 3 November 2026

వెనుకబాటు తనం వల్లే మావోయిజం : సోనియా


రాయ్‌పూర్‌, నవంబర్‌ 12 (జనంసాక్షి) :
వెనుకబాటు తనం వల్లే మావోయిజం పెరిగిపో యిందని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ రెండో విడత ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. అభివృద్ది లేకపోవడం వల్లే కొంత మంది ప్రజలు బలవంతంగా నక్సలిజం అ నే తపుపడు మార్గాన్ని ఎంచుకున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోని యా గాంధీ అన్నారు. చత్తీస్‌ గఢ్‌లో రమణ్‌సింగ్‌ నేతృ త్వంలోని భాజపా శాంతి భద్రతల పరీరక్షణలో పూర్తిగా విఫలమైందని కేంద్రం ఎంత మద్దతిచ్చిని నక్సల్స్‌ను ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు తీసుకున్న చర్యలు అంతంత మాత్రమేనని అన్నాడు మంగళవారం బిలాయ్‌లో జరిగిన ఎన్నికల సభలో ఆమె మాట్లాడారు. పదేళ్ల భాజపా పాలనలో రాష్ట్రం వెనక్కు వెళ్లిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కేంద్ర ప్రభుత్వ పథకాలకు చెందిన వేల కోట్ల సొమ్ము ఇక్కడి ప్రజలకు అందలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ బట్టి హామీలు ఇవ్వదని, ఇచ్చిన హామీలను నిలుపుకుంటుందని చెప్పాడు. జగదల్‌ పూర్‌ వద్ద 25 మంది రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలను నక్సల్స్‌ హతమార్చిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకన్నా సిగ్గు చేటైన విషయం ఇంకోటి ఉండదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *