
కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి
గుంటూరు, నవంబర్ 12 (జనంసాక్షి) :
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించే క్రమంలో పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించాలని అధిష్టానం సూచిస్తే అలాగే నడుచుకుంటానని కేంద్రమంత్రి పనబాకలక్ష్మి తెలిపారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ పార్టీ విప్ జారీచేయకపోయినా కూడా అధిష్టానం చెప్పినట్లుగానే అనుకూలంగా ఓటే స్తానన్నారు. విభజన తర్వాత సీమాంధ్ర రాష్ట్రాన్ని సింగపూర్‌లా అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు జీఓఎంకు, ప్రధానమంత్రికి అందించామన్నారు. బిజెపిలా రెండు నాల్కల ధోరణితో వ్యవహరించలేనని మంత్రి పనబాక స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రజలను ఏమాత్రం తాము నిర్లక్ష్యం చేయడంలేదన్నారు. రాష్ట్ర విభజన అనేది పూర్తిగా కేంద్రప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమని, గతంలోనే తెలంగాణ వారికి హావిూని ఇచ్చి నందుననే ఎన్నికలకు ముందు పూర్తి చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు అన్నీ కలిసి నేడు కాంగ్రెస్‌ను దోషిగా చేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. నిన్నటి వరకు తెలంగాణను త్వరగా తేల్చండి అంటూ ఒత్తిడి చేసిన టిడిపి, వైసిపిలు నేడు యూటర్న్ తీసుకుని ఒకరికంటే ఇంకొకరు పోటీ పడుతూ రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పని అయిపోయిందని కొందరు చేస్తున్నవన్నీ బూటకపు ప్రచారాలేనన్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే వారు కొంత మంది అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమేనన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణలో, సీమాంధ్రలోను కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు. కేంద్రంలో కూడా బిజెపి ఆశలను ప్రజలు గల్లంతు చేస్తారన్నారు. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు వస్తుందన్నారు. కొత్తసంవత్సరం కల్లా రెండు రాష్టాల్ల్రో ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలనను ప్రారంభిస్తారని పనబాకలక్ష్మి పేర్కొన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వడం వల్లే ప్రజలు గెలిపించారని, దాని ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందన్నారు. తాను సమైక్యవాదినా, విభజన వాదినా అనేది కాకుండా పక్కాగా అధిష్టాం వాదినని పనబాక లక్ష్మి పేర్కొన్నారు. విజయవాడ-గుంటూరుల మధ్య తూర్పు మధ్య కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. మచిలీపట్నం, రేపల్లే, బాపట్ల కోస్తా రైల్వే లైనును నిర్మించాలని కోరామని ఆమె తెలిపారు. నిన్నటివరకు ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్ర విభజన బిల్లుకు మద్దతిస్తామని చెప్పిన బిజేపి నేడు షరతులు పెట్టాలనుకోవడం రెండు కళ్ల ధోరణెళి అవుతందన్నారు. కాంగ్రెస్‌కు కేసిఆర్ అవసరం ఎంత మాత్రం లేదన్నారు. ఈనెల 18న మరోసారి జిఓఎంను కలిసి అనేక ప్రతిపాదనలు ఇవ్వనున్నామన్నారు. సీమాంధ్రుల ప్రయోజనాలకు ఉపయోగ పడే ఆంటోని కమిటీ నివేదికను బిల్లులో అవకాశం కల్పించాలని కోరనున్నామన్నారు. ఆంటోని కమిటీ ఇచ్చిన సూచనలు పూర్తిగా అమలు చేయాలని లేని పక్షంలో రాష్టాన్న్రి సమైక్యంగా ఉంచాలని మన్మోహన్‌సింగ్‌ను, సోనియాగాంధీని కలిసి కోరుతామన్నారు.
తెలంగాణ బిల్లుపై అనుకూలంగా ఓటు




