
ఖమ్మం, నవంబర్ 12 (జనంసాక్షి) :
భద్రాచలం ముమ్మాటికీ తెలంగాణాదేనని విద్యార్థులు కదం తొక్కారు. భద్రాచలం డివిజన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనైనా వారు డిమాండ్ చేశారు. భద్రాచలాన్ని సీమాంధ్రకు అప్పగించనున్నారని వస్తున్న లీకులను వ్యతి రేకిస్తూ పట్టణంలో వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. భద్రాచలం ముమ్మాటికి ఖమ్మం జిల్లాలో అంతర్భాగమేనని విద్యార్థులు పేర్కొంటున్నారు. వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు స్వచ్చందంగా ముం దుకు వచ్చి తరగతులు బహిష్కరించి పట్టణంలోని ప్రధాన వీదుల గుండా కేంద్రానికి, సీమాంధ్రకు చెందిన నేతలకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం అటు వైపు ఆలోచించినా కూడా చూస్తూ ఊరుకు నేదిలేదని, తమఆందోళనను ఉదృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. భద్రాచలం చరిత్రను చదువు కోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కాకతీయుల కాలం నాటినుంచే భద్రాచలం తెలంగాణలోనే ఉందని పేర్కొన్నారు. సీమాంధ్ర పాలకులకు దిమ్మ తిరిగేలా ఆందోళనలు చేసి రుచి చూపిస్తామన్నారు. తెలంగాణ ఇస్తున్న సమయంలో కొత్త కొత్త కిరికిరిలు పెడుతూ ప్రజలను, విద్యార్థులను విడగొట్టి ఆడుకోవాలని చూస్తు న్నాయని, ఇప్పటికైనా మినహాయించక పోతే మాత్రం ఆందోళనలు ఉదృతం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు అఖిలపక్ష నేతలు మద్దతిచ్చారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి భద్రాచలంను ఖమ్మం జిల్లాలోనే ఉంచుతామని స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఆందోళనలు ఏదో రూపంలో ఉంటాయని హెచ్చరించారు. వివిధ విద్యార్థి సంఘాలకు చెందిన ప్రతినిధులు తమతమ సభ్యులతో కలిసి వచ్చి ఆందో ళనలో పాల్గొనడంతో భద్రాచలం పట్టణం జైతెలంగాణ నినాదాలతో మార్మోగింది. ఆందోళనకారులు ఆగ్రహంతో ఉన్నందున ఏమైనా విద్వంసకర సంఘటనలు చోటుచేసుకోవచ్చని భావించిన పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దింపి పర్యవేక్షించారు.
భద్రాచలం తెలంగాణాదే కదంతొక్కిన విద్యార్థులు




